తెలుగు దేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయిచింది. పార్టీ తరపున టీడీపీ దళిత నేత వర్ల రామయ్య పోటీ చేస్తారు. ఈ మాట చంద్రబాబే చెప్పారు. అయితే పార్టీ టికెట్ దొరికితే ఎవరైనా సంతోషపడతారు. కానీ వర్ల రామయ్యలో ఆ సంతోషం ఏమాత్రం కనిపించం లేదు. పాపం.. మరోసారి తాను బలి పశువును అయ్యానన్న ఆందోళన మాత్రమే కనిపిస్తోంది.

 

 

ఇప్పుడు వర్ల రామయ్యను చూస్తే.. తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు గుర్తుకు వస్తున్నారు. ఎందుకంటే.. ఆయన కూడా తెలుగు దేశం కోసం బాగా కష్టపడ్డారు. ఆయన్ను తప్పని సరిగా గవర్నర్ ను చేస్తానని చంద్రబాబు చాలాసార్లు హామీ ఇచ్చారు. కానీ గవర్నర్ సంగతి దేవుడెరుగు కనీసం ఎంపీని కూడా చేయాలేదు. ఆయన చూసి చూసి విసిగి వేసారి.. చివరకు చంద్రబాబును బండ బూతులు తిట్టి పార్టీ నుంచి బయటకు వచ్చేసారు.

 

 

ఇప్పుడు వర్ల రామయ్యను చూస్తే ఆ మోత్కుపల్లి నరసింహులే గుర్తొస్తున్నారు. ఎందుకంటే.. గతంలోనూ వర్ల రామయ్యను ఎంపీగా చేసే అవకాశం వచ్చింది. ఆయన పేరు కూడా పార్టీ ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో ఆయన్ను కాదని.. చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి చెందిన కనకమేడల రవీంద్ర బాబుకు ఇచ్చుకున్నారు. ఆయన ఆ రోజు అంతా రెడీ చేసి.. ఫ్యామిలీతో ప్రకాశం బ్యారేజీ వరకు వెళ్లిన తరువాత ఈ సారికి కుదరదని వర్లరామయ్యకు చంద్రబాబు హ్యాండ్‌ ఇచ్చారు.

 

 

వాస్తవానికి ఆ రోజు మూడు రాజ్యసభ సీట్లు అవకాశం ఉంటే గుంటూరు జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పుష్పరాజ్‌కు సీటు ఇస్తామని చెప్పి అప్పుడూ మోసం చేశారు. అలాగే మోత్కుపల్లి నరసింహులును గవర్నర్‌ను చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారు. గెలిచే అవకాశం ఉన్న రోజుల్లో దళితులకు అవకాశం ఇవ్వకుండా.. ఇప్పుడు కచ్చితంగా ఓడిపోయే సీటులో వర్లను పోటీ కి పెట్టడం అన్యాయం కాదా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: