ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా అతి తొందర్లోనే ముగించేయాలని చూస్తున్న జగన్ అందుకోసం తనకు ఎదురవుతున్న చిక్కుముడులు అన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ, ఫలితాల ప్రకటన అన్నీ ఈ నెలాఖరులోపు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జనవరిలో జరగాలి. బీసీలకు 59 శాతం రిజర్వేషన్ మీద కోర్టు పిటిషన్ దాఖలు కావడంతో రెండు నెలల సమయం గడిచిపోయింది. ఈ వ్యవహారంలో టిడిపి సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. బీసీల ద్రోహిగా జగన్ ను చూపించాలని ప్రయత్నించింది టీడీపీ. దీనిని జగన్ సమర్థవంతంగా జగన్ తిప్పికొట్టారు. 

IHG


ఇప్పుడు హైకోర్టు తీర్పు కారణంగా 24 శాతానికి తగ్గిన బిసి కోటా యధాతథంగా అంటే 30 శాతం ఉండేలా చూసేందుకు తమ పార్టీలోని జనరల్ సీట్ల నుంచి మరో 10 శాతం ఇచ్చేలా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్ ఈ ఎన్నికలను ఈ నెలలోనే ఇంత కసిగా నిర్వహించాలని చూడటం వెనుక కేంద్ర నిధులు అంశం కూడా ఉంది. ఈ నెలాఖరులోపు ఎన్నికలు పూర్తి చేస్తే సుమారు 5వేల కోట్ల మేరకు నిధులు విడుదల అవుతాయి, లేకపోతే ఆ నిధులు విడుదల కావు. దీంతో కొత్త పథకాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి 5 వేల కోట్ల రూపాయల నిధులు చాలా ఉపయోగపడతాయి అని జగన్ భావిస్తుండటం తోనే ఇప్పుడు ఎన్నికలపై ఇంతగా దృష్టిపెట్టినట్లు అర్థమవుతోంది. 

 

దీంతోపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా, ఏపీలో పూర్తి పట్టు తనకే ఉందని, టిడిపి పని అయిపోయింది అని నిరూపించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అలాగే  ఈ తొమ్మిది నెలల ప్రభుత్వ పాలన తీరుకు ప్రజలు ఇవ్వబోతున్న తీర్పు అని జగన్ భావిస్తుండటం తో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. దీంతోపాటు ఈ ఎన్నికల్లో ఎక్కడా, అవినీతి అక్రమాలు జరగకుండా పారదర్శకతతో ఎన్నికలు జరిగేలా జగన్ వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: