ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక పూర్తయింది. అయితే జగన్ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో కొంతమంది ముందు ఊహించిన వారైనా.. మరికొంత మంది అనూహ్యంగా తెరపైకి వచ్చారు. మొదటి నుంచి నుంచి రాజ్యసభ స్థానం కోసం వైసీపీలో తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అయితే అకస్మాత్తుగా వైసీపీ తరపున రాజ్యసభ రేసులో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని, జనసేన పార్టీని దెబ్బ కొట్టేందుకు జగన్ ఈ విధంగా స్కెచ్ వేశాడని, రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. కానీ జగన్ చిరంజీవి విషయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, ఇప్పుడు రాజ్యసభకు ఆయనను ఎంపిక చేయకుండా, చిరంజీవిని  జగన్ పట్టించుకోలేదు.

 

IHG


 దీనిపై వైసీపీలోనూ తీవ్ర స్థాయిలో చర్చ నడిచింది. చివరి వరకు తనకు రాజ్యసభ సభ్యత్వం వస్తుందని చిరంజీవి కూడా ఆశలు పెట్టుకున్నట్టు గా తెలుస్తోంది. గతంలోనే చిరంజీవి జగన్ ను విజయవాడ వచ్చి మరి కలిశారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టుగానే చిరంజీవి అనేక సందర్భాల్లో జగన్ ను పొగుడుతూ మాట్లాడారు. అంతేకాదు తనకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని, ప్రధాని నరేంద్ర మోదీని, హోంమంత్రి అమిత్ షా ను సైతం సైరా సినిమాను మోదీకి చూపించేందుకు వెళ్లిన సందర్భంగా చిరంజీవి ప్రతిపాదన పెట్టినట్లు కూడా బయటకు పొక్కింది. 

 

IHG


అయితే చిరంజీవి విషయంలో బీజేపీ అంతగా ఆసక్తి చూపించకపోవడం, ఆ తర్వాత చిరంజీవి మళ్ళీ జగన్ ను కలిసి రాజ్యసభ సీటు కోరడం, చిరంజీవి విషయంలో జగన్ చాలా రకాలుగా లెక్కలు వేసుకుని చివరకు చిరంజీవికి ఇస్తే లేనిపోని విమర్శలు వస్తాయి అనే భావంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతో చిరంజీవి రాజ్యసభ కల కలగానే మిగిలిపోయింది అంటూ ఇప్పుడు ఆయనపై సానుభూతి కురుస్తోంది. ఈ విషయంలో చిరంజీవి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: