ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాయలసీమ లో సమీకరణలు ఎలా ఉన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీ హవానే. తరతరాలుగా టిడిపి ని అక్కడి ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో జగన్ మేనియా నడుస్తున్న కారణంగా ఇప్పటికే కడపలో తెలుగుదేశం పార్టీ సమూలంగా అంతరించిపోతున్న విషయం తెలిసిందే. అయితే చాలా విచిత్రంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కంచుకోటగా చెప్పబడే విశాఖ లో కూడా తెలుగుదేశం పార్టీ అవసాన స్థితిలో ఉంది.

 

విశాఖ ప్రాంతం మరియు చుట్టుపక్కల ఉత్తరాంధ్ర జిల్లాలలో తెలుగుదేశం పార్టీ కీలక నాయకులంతా ఒక్కొక్కరుగా వైసిపి బాట పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన రెహమాన్ కు తెలుగుదేశం పార్టీతో 25 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే అతను కూడా టిడిపి పార్టీని విమర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం మొదలెట్టేశాడు. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో అతిముఖ్యమైన నేత మరియు ఎలమంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.

 

2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన సమయంలో టిడిపి తరఫున భారీ మెజారిటీతో గెలిచిన పంచకర్ల 2019లో వైసీపీకి చెందిన కన్నబాబు చేతిలో ఓటమి చవి చూశాడు. అయితే తర్వాత నుంచి అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవల మూడు రాజధానులను ఏపీ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి చంద్రబాబు 'జై అమరావతి' అంటుండడంతో రమేష్ బాబుకి అక్కడి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. అతను కూడా బాబు కి మద్దతుగా ఒక్క విషయం పలకలేదు.  ఇకపోతే మొన్న ఎయిర్పోర్టులో బాబుని ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న సమయంలో కూడా అతనికి తోడుగా రమేష్ బాబు లేకపోవడం గమనార్హం. ఇలా పార్టీలో ఒక్కొక్క నాయకుడిని దూరం చేసుకుంటూ బాబు వైజాగ్ తీరంలలో తనకు తానే గొయ్యి తవ్వుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: