ఈరోజు ఉదయం నుండి దేశ రాజకీయాలలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జ్యోతిరాదిత్య సింధియా పేరు మారుమోగుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని క్రియాశీలక రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింధియా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో చేరడం మరియు చేరిన వెంటనే సోనియాగాంధీ పార్టీ పై తీవ్రమైన విమర్శలు గుప్పించడం ఇప్పుడు దేశ రాజకీయాలలో పెద్ద సంచలనానికి తెర లేపింది. ఇక తమ పని అయిపోయింది అన్న ప్రతీసారి భాజపా వారు ఏదో ఒక కొత్త ఎత్తుగడలతో రావడం గత దశాబ్దం నుండి మనం చూస్తున్న సీనే.

 

అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటినుండో మకాం వేద్దామని సిద్ధంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో అమలు చేసిన ప్రణాళికను ఇక్కడ కూడా చేయాలని చూస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే భాజపా హైకమాండ్ నుండి తెలంగాణ రాష్ట్ర బేజేపి నాయకులకు ఒక సందేశం వచ్చింది. ఒకవేళ కేటీఆర్ కు వ్యతిరేకంగా ఉండే ప్రముఖ లీడర్లు అయిన హరీష్ రావు మరియు ఈటెల రాజేందర్ కనుక తమ వైపు వస్తే వారితో ఎంత మంది ఎమ్మెల్యేలు వెంటే వెంట నడుస్తారు అన్నది అన్నది పక్కా విశ్లేషణతో ఊహించి చెప్పమని వారిని కోరారట.

 

 

బిజెపి పథకం ఏమిటంటే కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పార్టీలో అంతర్గత కలహాలు మొదలవుతాయని…. సీనియర్ నాయకులు పైన ఇప్పటికే కేటీఆర్ కు చాలా చిన్నచూపు ఉంది అదీ కాకుండా అతని తండ్రి కేసీఆర్ ముందు తనకన్నా హరీష్ రావు కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మరియు హరీష్ రావు తరపున మాట్లాడిన నాయకులందరినీ కేటీఆర్ టార్గెట్ చేయబోతున్నాడు అన్నది ముందు నుంచి ఉన్నమాటే. ఇప్పుడు అలాంటి వారందరినీ జల్లెడపట్టి సరైన సమయం చూసి ఒక మంచి ప్రముఖ లీడర్ ని వారి వైపు తిప్పుకొని మొత్తం పార్టీ నే నాశనం చేద్దామని మోడీ-షా ప్లాన్. తెలంగాణ రాజకీయాలు రానున్న రోజుల్లో మరింత ఆసక్తిగా మారనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: