బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ బీజేపీకి మసాలా లాంటి వాడు అని అన్నారు. బీజేపీకు ఉన్న క్యాడర్ పవన్ కు కూడా పనికొస్తుందని చెప్పారు. నాయకులు పార్టీలు మారడం కొత్తేం కాదని గతంలోను ఎన్నికల సమయంలో నాయకులు పార్టీలు మారారని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ క్యాడర్ కు పవన్ మసాలా, ఫ్లేవర్ అని ఆయన అన్నారు. 
 
రాష్ట్రంలో పవన్ కు బలమైన క్యాడర్ లేదని, బీజేపీ క్యాడర్ ఆయనకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఏపీ సీఎం జగన్ ను బీజేపీ వ్యతిరేకించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ డిమాండ్లను జగన్ అమలు చేస్తున్నప్పుడు బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయానికి తాము అనుకూలమని చెప్పారు. ఈ విషయంలో తాను జగన్ ను అభినందిస్తున్నానని తెలిపారు. 
 
వైసీపీ బీజేపీ భావాలకు అనుకూలంగా ఉన్నంత కాలం తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీలో గ్రూపులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయని పార్టీలో అలాంటివేం లేవని అన్నారు. రెండు చేతులు కలిస్తే చప్పట్లు ఎలా వస్తాయో... ఇద్దరం కలిసి పని చేస్తే దాని వల్ల మేలు జరుగుతుందే తప్ప ఎవరికీ నష్టం ఉండదని అన్నారు. మొదటి నుంచి హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ అనుకూలంగా ఉందని చెప్పారు. 
 
టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీ బీజేపీ సహకరించుకోవటం వట్ల పవన్ కళ్యాణ్ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ బీజేపీ కోరిక మేరకు నత్వానీకి రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో బీజేపీ ఎంపీ పవన్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: