మామూలుగా చాలామంది కుక్కలను పిల్లులను పెంచుకోవడానికి  ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక మనుషుల కంటే ఎక్కువ పెంపుడు జంతువులపై  ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఈరోజుల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఒకప్పుడు ఎక్కువగా కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ ఎంతో ప్రేమ చూపించే వారు. కానీ ఈ రోజుల్లో మాత్రం ఎక్కువగా పిల్లిని పెంచుకుంటున్నారు. ఇక వివిధ రకాల పిల్లలు మార్కెట్లో దొరుకుతుండడంతో ఎంతో ఇష్టపడి మరీ పెంపుడు పిల్లులను కొనుగోలు చేసి ఎంతో ప్రేమగా వాటిని చూసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి కామన్ అయిపోయింది. ఇక తాము పెంచుకునే పెంపుడు జంతువు ఎంత డిఫరెంట్ గా ఉంటే అంత గొప్ప అని భావిస్తూ ఉంటారు. 

 

 ఇక్కడ ఓ వ్యక్తి ఓ మార్జాలన్ని  పెంచుకుంటున్నాడు. మాములుగా అయితే పిల్లి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి పెంచుకుంటున్న పిల్లి  మాత్రం కాస్త డిఫరెంట్... ఇక్కడున్న పిల్లి డిఫరెంట్ అనడం కంటే... ఫుల్ డేంజరస్ అనడం బెటర్. ఎందుకంటే ఈ పిల్లిని చూస్తే ఎవ్వరైనా భయపడక మానరు. ఇప్పటికే ఎంతో మందిని హడలెత్తిస్తున్నది  ఈ పిల్లి. మీరు ఓ లుక్కేయండి... ఈ పిల్లిని  చూస్తుంటేనే భయమేస్తోంది కదా.మిమ్మల్నే  ప్రపంచంలో ఎంతోమందిని భయపెడుతున్నది  ఈ పిల్లి. ఈ పిల్లి  వయసు ఆరేళ్లు... ఈ మార్జాలం పేరు క్సేర్డాన్ . ఇక ఈ పిల్లి సోషల్ మీడియాలో సెలబ్రిటీ అనే చెప్పాలి. 

 

 

 ఎందుకంటే ఈ పెళ్లికి ఇంస్టాగ్రామ్ లో ఏకంగా ఇరవై వేలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పిల్లి స్విట్జర్లాండ్లోని రూటీ లో ఉంటుంది. మామూలు పిల్లులకు ఈ పిల్లకి ఎంతో తేడా ఉంటుంది. ఈ పిల్లికి శరీరంపై వెంట్రుకలు లేవు. అందుకే అన్ని మార్జాలాల  కంటే  పిల్లి కాస్త డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ పిల్లిని చూసాము అంటే చాలు.. ఇదేంట్రా బాబు ఇంత  భయంకరంగా ఉంది అనక తప్పదు. స్విట్జర్లాండ్ కు  చెందిన 47 ఏళ్ల శాండ్రా ఫ్లిప్పీ ఈ  మార్జాలాన్ని  పెంచుకుంటున్నాడు. అయితే ఈ పిల్లి  యజమాని మాత్రం ఈ పిల్లిని  ఎంతో స్వీట్ అండ్ క్యూట్ అని మురిసి పోతూ ఉంటాడు. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఈ పిల్లిని ఏలియన్ తో పోలుస్తూ ఉంటారు. ఎవరైనా అలా అంటే మాత్రం పిల్లి యజమాని శాండ్రా ఫ్లిప్పి వారి మీద తెగ సీరియస్ అవుతు  ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: