ఎన్నికలు వచ్చాయి అంటే పదవుల కోసం ఆశపడే వారు ఎంతోమంది. ఎందుకంటే ఒక్కసారి పదవిలోకి వచ్చిన తర్వాత అంత సెట్ అయిపోతుంది అనుకునేవారు కొంతమంది అయితే... పదవిలోకి వచ్చాక ప్రజా సేవ చేయాలి అనుకునే వారు ఇంకొంతమంది. ఏదేమైనా ఎన్నికల సమయం వచ్చింది అంటే మాత్రం పదవి కోసం ఆరాటం... దక్కించుకోవటం కోసం  పోరాటం.. ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఏ పార్టీ నుండి  అవకాశం దొరికనప్పుడు ఏకంగా పదవిపై వ్యామోహం తో ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తున్నారు చాలా మంది. పదవిని దక్కించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే ప్రభుత్వ ఉద్యోగంలో  ఉన్న వాళ్లు కూడా.... ఎన్నికల సమయంలో పోటీచేసి పదవులను దక్కించుకుని.. ప్రభుత్వ ఉద్యోగాలకు స్వస్తి పలుకుతున్నారు. 

 

 

 మామూలుగానే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా కష్టమైన పని.. ఇక ఎన్నికల్లో పదవి  అంటారా... అంతా ఓటర్ల చేతిలో ఉంటుంది.. గెలవడం ఓడడం అనేది ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అయినా కానీ ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి మరి పదవులను ఆశిస్తున్న వారు చాలామంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి పదవులు ఆశించి భంగపడిన వారు చాలా మంది ఉన్నారు.. ఇక ఇంకొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి ప్రస్తుతం రాజకీయాల్లో మంచి పదవిలో కొనసాగుతున్న వారు కూడా లేకపోలేదు. ఇక ప్రస్తుతం ఏపీ లో ఒక మహిళ పదవి కోసం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకునేందుకు  సిద్ధపడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోలాహలం నెలకొన్న విషయం తెలిసిందే. 

 

 

 ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో ఈ ఎన్నికల సందడి మరింత ఎక్కువ అయిపోయింది. అయితే పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం దొడ్డనపూడి ఎంపీటీసీ-1 స్థానానికి గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్నా చికిలే  రేణుకా చౌదరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే వాలంటీర్ల ఉద్యోగంలో ఉన్నవారి నామినేషన్ చెల్లదు అంటూ ఎంపీడీవో, రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు. దీంతో వాలింటర్  పదవికి రాజీనామా లేఖను కార్యదర్శి ఇస్తాను అంటూ రేణుకా చౌదరి చెప్పడంతో నామినేషన్ స్వీకరించారు అధికారులు. అంటే ఇక్కడ ఈ మహిళ ఏకంగా పదవి కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: