ప్రపంచంలోనే అతి గొప్ప బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ ఒక్క బాక్సింగ్ మ్యాచ్ ఆడి వేల కోట్లు సంపాదిస్తాడు. గతంలో మ్యాన్నీ పాసీక్వినో తో ఆడిన మ్యాచ్ లో గెలిచి దాదాపు రూ.వెయ్యి కోట్ల ను కేవలం 15 నిమిషాల లోపే సంపాదించి ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్ కి గురి చేశాడు. నిజానికి మేవెదర్ కటిక పేదరికం లో పుట్టాడు. కానీ బాక్సింగ్ కెరీర్ అతడిని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మార్చేసింది. ఎప్పుడూ అతని ఆస్తుల, లగ్జరీయోస్ లైఫ్ స్టైల్ గురించి వార్తలు వస్తూ ఉంటాయి కానీ ఈ సారి మాత్రం అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ గురించి వార్తలు వెల్లువెత్తుతున్నాయి.




వివరాలు తెలుసుకుంటే... లాస్ ఏంజలెస్ కు చెందిన జోసి హారిస్, బాక్సర్ మేవెదర్ కలిసి 1995 నుండి 2010 వరకు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారి బంధానికి ఫలితంగా ముగ్గురు పిల్లల సంతానం కూడా కలిగింది. అయితే 2010లో తనని బాగా హింసిస్తున్నాడని జోసి వ్యాఖ్యలు చేస్తూ మేవెదర్ తో తనకున్న రిలేషన్ షిప్ కి బ్రేక్ అప్ చెప్పింది. దాంతో గృహహింస చట్టం కింద మేవెదర్ కి రెండు నెలల పాటు జైలు శిక్ష విధించారు అధికారులు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత యూఎస్ఏ టుడే లో మేవెదర్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ... హారిస్ బాగా మాదక ద్రవ్యాలను వాడుతూ మత్తులో జోగుతుంటే పద్ధతి మార్చుకోమని ఆమె చెయ్యిని మెలి తిప్పి కొట్టానని చెప్పుకొచ్చాడు.





కానీ మేవెదర్ చేస్తున్న ఆరోపణలు మొత్తం అవాస్తవమని 2015 లో అతని పై పరువు నష్టం దావా వేసింది హారిస్. ఐతే ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత అనగా ఆమెకి 40 సంవత్సరాల వయసులో లాస్ ఏంజిల్స్ లోని తన ఇంట్లోనే వాక్‌వేలోని తన కారులో అనుమానాస్పద స్థితిలో మరణించింది. మంగళవారం రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో ఆమె చనిపోయిందని లాస్‌ఏంజెల్స్‌ కౌంటీ షరీఫ్‌ అలెక్స్‌ విలెనువా తెలిపారు. ప్రస్తుతం ఆమె మరణం పై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: