తెలంగాణ శాసనమండలిలో గురువారం రోజు ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుని వార్తల్లో నిలుస్తోంది. శాసన మండలి సాక్షిగా ఉన్నత స్థానంలో ఉన్న ఒక మంత్రి ప్రజాప్రతినిధులకు క్షమాపణ చెప్పి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. అతను ఎందుకు ప్రజాప్రతినిధులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందంటే... ఆర్టీసీ అధికారులు ప్రజా ప్రతినిధులను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదట. ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేస్తే కనీసం ఆర్టీసీ అధికారులు లిఫ్ట్ కూడా చేయడం లేదంట.

 

 

ఈ విషయమును కాస్త అందరికీ తెలియడంతో ఓ మంత్రి దీనిపై స్పందిస్తూ... ఆర్టీసీ అధికారులు ప్రజా ప్రతినిధుల ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయకపోవడం ముమ్మాటికీ తప్పే. అలానే వారికి ఎటువంటి సమాచారం అందించక పోవడం కూడా పొరపాటే. వీరు చేసిన తప్పులకు, పొరపాట్లకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను' అని తెలంగాణ శాసనసభ మండలి లో చెప్పుకొచ్చారు.




తాను ఇంకా మాట్లాడుతూ... ఆర్టీసీ పార్సిల్ సేవలు ద్వారా రూ. 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఒక అంచనా వేశారు. అలాగే ఆర్టీసీ రోజుకి రూ.కోటి ప్రాఫిట్ ని సంపాదిస్తుంది అని, ఆ ప్రాఫిట్ తోనే గత రెండు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు.





అలాగే గతంలో ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు ఉద్యోగులకు జీతాలు అందలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల జీతాల కోసం 235 కోట్ల రూపాయలను విడుదల చేసిందని కేసీఆర్ చిత్రపటానికి ఆర్టీసీ జేఏసీ నేతలే పాలాభిషేకాలు చేస్తున్నారని ఈ మంత్రి చెప్పుకొచ్చారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన సిసిఎస్ బకాయిలు, పిఎఫ్ బకాయిలు చెల్లించేందుకు అనేక బ్యాంకులు 600 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చేందుకు రెడీ గా ఉన్నాయని ఆ మంత్రి వెల్లడించారు. మూడో నెలల్లో అనగా జులై నెల లోపు ఖమ్మం జిల్లాలో 20 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హంగులతో బస్టాండ్ ని రూపొందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: