గోవిందా గోవిందా అంటూ గుల్ల చేస్తారు..! నమో వెంకటేశా అంటూ నిలువుదోపిడీ చేస్తారు...! ఇలా ఒకటి కాదు రెండు కాదు.. భక్తులకు పంగనామాలు పెట్టి కోట్లు కొల్లగొట్టేశారు. ఇప్పుడు ఆ మోసగాళ్లకు చెక్‌ పెట్టేందుకు పూర్తిస్థాయి ఆపరేషన్‌ నిర్వహిస్తోంది టీటీడీ.  దళారులు తిన్నదంతా కక్కంచేపని దిగ్విజయంగా సాగుతోంది. ఆ డబ్బు  శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామివారి ఖజానాకు మళ్లిస్తోంది. 

 

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనానికి సామాన్యులే కాదు... వీఐపీలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. దీంతో చాలా మంది వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ప్రయత్నిస్తుంటారు. ఐతే ఆ టికెట్లను టీటీడీ పరిమిత సంఖ్యలో జారీ చేస్తుంది. అది కూడా సిపార్సు లేఖలపై మాత్రమే ఇస్తుంది. శ్రీవారిని సులభంగా, అతిదగ్గర నుంచి దర్శించుకోవాలనుకునే భక్తులు... వీఐపీ టికెట్ల కోసం దళారులను ఆశ్రయించేవారు. ఇక వసతి గదులును పొందాలన్నా, లడ్డు ప్రసాదం కావాలన్నా దళారులను సంప్రదిస్తే ఈజీగా లభిస్తాయనే వరకూ పరిస్థితి దిగజారింది. 

 

దళారులు భక్తులను భట్టి నిలువుదోపిడీ చేసేవారు. ఎల్-1 టికెట్టు అయితే 15వేలు, ఎల్‌-2 ఐదు వేలు, ఎల్‌-3 మూడు వేల వరకూ విక్రయించేవారు. ఇక వసతి గదులు, లడ్డు ప్రసాదాలు వీటికి అదనం. ఇలా ప్రతిరోజు 200 నుంచి 300 వరకు టికెట్లు దళారుల చేతిలో ఉండేవి. వీటిని విక్రయించడం ద్వారా రోజుకు 40లక్షల చొప్పున, నెలకు 12 కోట్లు దళారుల జేబులు నిండేవి. ఈ లెక్కన ఏడాదికి 150 కోట్లు రూపాయలు శ్రీవారికి చెందవలసిన నిధులు దళారులపాలైయ్యేంది.

 

దళారుల ఆగడాలపై దృష్టిపెట్టిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి... తన మొదటి సమావేశంలోనే కీలక సంస్కరణలు చేపట్టారు. దళారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. దళారి వ్యవస్థకు అవకాశం కల్పిస్తున్న ఎల్ 1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. అవసరమైతే తన కార్యలయంలో జారి చేసే టిక్కేట్లును కూడా తనిఖీ చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. 

 

టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి కార్యచరణ మొదలుపెట్టారు. అసలు దళారి వ్యవస్థ ములాలు నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రజా ప్రతినిధుల పీఆర్వోల ముసుగులో, నకీలి మీడియా ముసుగులో, టీటీడీ ఉద్యోగులు దళారులుగా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్లు  గుర్తించారు. వారిపై నిఘా ఉంచారు. దళారులు పొందుతున్న టికెట్లపై ఫోకస్ పెట్టిన విలిజెన్స్‌ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏడు నెలలు కాలంలో 186 కేసులు నమోదు చేసి 
1, 432 మంది దళారులను అరెస్ట్ చేశారు పోలిసులు.  గత ఐదేళ్లతో పోలిస్తే 450 శాతం అధికంగా...కేసులు నమోదయ్యాయి. 

 

ఓ వైపు దళారులకు చెక్ పెడుతునే.....మరో వైపు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కేట్లు భక్తులకు సులభంగా అందేలా టీటీడీ చర్యలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీకారం చుట్టింది. ఎలాంటి సిపార్సు లేఖ లేకూండా ట్రస్టుకు 10 వేల రూపాయలు విరాళంగా అందిస్తే చాలు.....వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు పొందేలా అవకాశం కల్పించారు. దీనికి భక్తుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  రోజుకు 500 మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కి విరాళాలుగా పది వేల రూపాయలు అందిస్తూన్నారంటే అర్దం చేసుకోవచ్చు. దీంతో టీటీడీ ఖజానాకు డబ్బులు చేరుతున్నాయి. దళారుల అవసరం లేకుండా భక్తులు టికెట్లు పొందుతున్నారు. 

 

ఇటు వసతి గదులు కేటాయింపు కూడా సామాన్య భక్తులుకు ప్రాధ్యానత ఇచ్చేలా మార్పులు చేశారు. ఇక లడ్డు ప్రసాదాలు భక్తులు ఎన్నికావాలంటే అన్ని పొందేలా మార్పులు చేశారు. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకూండా.....కౌంటర్లోకి వెల్ళి డబ్బులు చెల్లించి కళ్యాణోత్సవం లడ్డు ప్రసాదం కోనుగోలు చేసే అవకాశం కల్పించింది. డిమాండ్ కంటే లభ్యత ఎక్కువగా వుండేలా  చర్యలు తీసుకుంది. దీంతో భక్తులు దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ చర్యలతో దళారి వ్యవస్థను కూకటివేళ్లతో పెకలిస్తోంది టీటీడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: