ఇంటా బ‌య‌టా ప‌నుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌వుతున్న మ‌హిళ‌కు సంతాన సాహ‌ల్య అవ‌కాశాలు త‌గ్గుతున్న‌ట్లు ఒక తాజా అధ్యాయ‌నం వెల్ల‌డిస్తోంది. ప‌ని ఒత్తిడి వ‌ల్ల‌ మ‌హిళ‌ల్లో గ‌ర్భ‌ధార‌ణ అవ‌కాశాల‌ను త‌గ్గిస్తోంద‌ని తాజా స‌ర్వేలో తేలింది. ప‌ని ఒత్తిడి మ‌హిళ‌ల్లో గ‌ర్భ‌ధార‌ణ అవ‌కాశాల‌ను మ‌హిళ‌ల్లో ఇటీవ‌ల ఒక అధ్యాయ‌నంలో గుర్తించారు. పిల్ల‌లు కావాల‌నుకునే మ‌హిళ‌లు క‌చ్చితంగా  ఒత్తిడి తగ్గించుకునే అంశం పై దృష్టి పెట్టాల‌ని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది మ‌హిళ‌లు తీరిక లేకుండా ప‌ని చేస్తున్నార‌ని అందుకు ఒత్తిడికి గుర‌వుతున్నారు. సంతాన రాహిత్యానికి, గ‌ర్భం ధ‌రించ‌లేక‌పోవ‌డానికి ప‌ని ఒత్తిడి కొంత మేర‌కు కార‌ణం అవుతోంది. ఒత్తిడి మూలంగా గ‌ర్భం ధ‌రించే అవ‌కాశాలు మిగ‌తావారితో పోలిస్తే 25శాతం మేర‌కు త‌గ్గుతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు అధ్యాయ‌నంలో గుర్తించారు.

 

ఈ నేప‌ధ్యంలో సంతానం కోరుకునే మ‌హిళ‌లు  ఒత్తిడిన త‌గ్గించుకోవ‌డంతోపాటు మాన‌సిక ప్ర‌శాంత‌త పై కూడా దృష్టిని సారించాలి. ఇందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి ప‌ద్ధ‌తుల్ని ఆచ‌రించడం మంచిద‌ని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు. లేనిపోతే టెన్ష‌న్స్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల పిల్ల‌లు పుట్ట‌డం చాలా క‌ష్టం. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక టెన్ష‌న్ లో ఉండ‌డం వ‌ల్ల ఒక‌వేళ గ‌ర్భం వ‌చ్చినా కూడా అది నిల‌వ‌దు. అబార్ష‌న్ అయిపోయే ప్ర‌మాదం ఉంది. రెండు లేక మూడో నిల‌లోనే బ్లీడింగ్ క‌నిపించేస్త‌ది. కాబ‌ట్టి ఎక్కువ‌గా టెన్ష‌న్ ప‌డ‌కూడ‌దు. అంతేకాదు చాలా మంది ఏదైనా చిన్న విష‌యం ఉన్నా కూడా కాస్త ఎక్కువ‌గా ఆలోచిస్తూ ఉంటారు. దాని వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు. ఏదైనా ప్రాబ్ల‌మ్స్‌లో ఉన్న‌ప్పుడు దాన్ని కొంత వ‌ర‌కు ఆలోచించి త‌ర్వాత దేవుడి పైనే భారం వేసి ఉండాలి. 

 

అలా చేయ‌డం వ‌ల్ల కొంత వ‌ర‌కు మ‌న‌సుకు ప్ర‌శాంత‌త దొరుకుతుంది. ఇంత ప్ర‌శాంత‌మైన లైఫ్‌ని లీడ్ చెయ్య‌డ‌మ‌నేది కాస్త క‌ష్ట‌మే. చాలా మంది మ‌న‌స్త‌త్వం కాస్త చింద‌ర వంద‌ర‌గా ఉంటుంది. అలాంట‌ప్పుడు ఎక్కువ‌గా దేవుడి ధ్యానంలో ఉండ‌డం చాలా మంచిది. ఎంత ఎక్కువ‌గా దేవుడి ధ్యానంతో ఉంటే మ‌న‌సు అంత ప్ర‌శాంతంగా ఉంటుంది. మ‌న ప‌నులు కూడా అంత చ‌క్క‌గా పూర్త‌వుతాయి. ఇవ‌న్నీ కూడా పాటిస్తే త‌ప్ప‌కుండా మీరు అమ‌మ అని పిలుపించుకోవ‌చ్క‌చు. ఎక్కువ‌గా ఆలోచించ‌డం వ‌ల్ల మ‌న‌కు శ‌రీర భారం కూడా పెరిగే ప్ర‌మాద‌ముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: