తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పనుంది. కరోనా ప్రభావంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కరోనా ప్రభావం తగ్గేంత వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిలిపివేయాలని కోరారు. హోం మంత్రి రాష్ట్రంలో దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటం, సొంత పార్టీ ఎమ్మెల్యే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేయాలని కోరడంతో విజ్ఞప్తిని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. 
 
రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్నారు. తగిన సంఖ్యలో బ్రీత్ అనలైజర్లు లేకపోవడంతో ఒకే బ్రీత్ అనలైజర్ ను ముగ్గురు, నలుగురికి వినియోగిస్తున్నారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల రోజురోజుకు భయాందోళన పెరుగుతూ ఉండటంతో కొందరు బ్రీత్ అనలైజర్లు ఒకరికి వాడినవి మరొకరికి ఉపయోగించవద్దని పోలీసులను కోరుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ప్రభుత్వం నిలిపివేయాలనే డిమాండ్ ప్రజల నుండి, సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా బ్రీత్ అనలైజర్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేయాలని వాహనదారులు కోరుతున్నారు. కానీ పోలీసులు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేయమని తేల్చి చెప్పారు. 
 
ఈరోజు అసెంబ్లీ జీరో అవర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా ఫీవర్ పోయేంత వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిలిపివేయాలని కోరారు. మంత్రి మహ్మద్ అలీ ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అతి త్వరలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: