దేశంలో వ్యభిచారం పడ గా విప్పింది. రెచ్చిపోతున్న బడా బాబులు.. వివిధ రకాలు గా వ్యభిచారం విహారం చేస్తూ వస్తుంది. ఈ మేరకు సామాచారం అందుకున్న పోలీసులు ఎక్కడిక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నించినా కూడా రోజు రోజుకు ఈ వ్యాపారం జోరందుకుంటూ వస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో భారీ గా పట్టుబడ్డ ఈ సెక్స్ రాకెట్ ఇప్పుడు మరో చోట రెచ్చిపోతుంది. 

 


గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ని చినకాకాని లో గత కొంతకాలం గా జరుగుతున్న వ్యభిచార గుట్టుని పోలీసులు రట్టు చేశారు. పూర్తి వివరాల్లో కి వెళితే.. చినకాకా ని గ్రామ పంచాయతీ పరిధిలోని రాజ్ రోడ్డు సమీపంలో ఓ ఇద్దరు మహిళలు ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడికి ప్రభుత్వాధికారులు విటులు అవ్వడం గమనార్హం. 

 

 


అసలు విషయానికొస్తే.. మంగళవారం రాత్రి వ్యభిచారం నడుపుతున్నార నే సమాచారం పోలీసుల కు అందింది. దీంతో మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్ఐ శ్రీనివాస రెడ్డి తన సిబ్బంది తో ఆ ఇంటి పై మెరుపుదాడి చేశారు.వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళల తో పాటుగా ఒక విటుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

 

 


అయితే వారి వద్ద నుంచి 10 నగదు ను, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అంతే కాకుండా ఈ వ్యభిచార గుట్టలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలను ఇంటికి రప్పించి మరీ వ్యభిచారం చేయిస్తున్నారని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే అలా ఇంటికి వచ్చి వెళ్తున్నారో వారి పై విచారణ చేపట్టారు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: