ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగిన నాటినుండి ఏపీ రాజకీయలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వరుసపెట్టి లైన్ లో వైకాపాలోకి జాయిన్ అవ్వడానికి క్యూ కడుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో కీలకమైన నాయకులు ఇప్పటికే జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దీంతో ఉక్కిరిబిక్కిరై పోతున్న చంద్రబాబు కి ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా జగన్ పార్టీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వరుసబెట్టి వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా కరణం బలరాం మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కలుస్తున్నట్లు కన్ఫామ్ చేశారు. అయితే ఈ సందర్భంలో నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైయస్ జగన్ తో భేటీ అవుతున్నట్లు ఆయన వెల్లడించారు.

 

నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధుల విషయంలో వైయస్ జగన్ తో చర్చించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే వైయస్ జగన్ తో భేటీ గురించి కరణం బలరాం చీరాల నియోజకవర్గంలో తన సన్నిహితులతో మరియు అనుచరవర్గం తో అదేవిధంగా మద్దతుదారులతో చర్చలు జరపడం జరిగింది. ఇదిలా ఉండగా ఎప్పటినుండో చీరాల నియోజకవర్గంలో వైకాపా పార్టీ కి అండగా ఉన్న క్యాడర్...కరణం బలరాం పార్టీలోకి రావడం పట్ల తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వైకాపా క్యాడర్ ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతూ అదేవిధంగా అక్రమ కేసులు బనాయించి అనేక సమస్యలు సృష్టించడంతో కరణం బలరాం పార్టీలోకి రావడానికి చాలా మంది చీరాల వైకాపా క్యాడర్ ఇష్టపడటం లేదు.

 

మరో పక్క మాత్రం కరణం బలరాం జగన్ తో చర్చలు అంటున్నా గాని...వాటిలో నిజం లేదని ఆయన పార్టీలోకి రావటం గ్యారెంటీ అనే టాక్ బలంగా ఏపీ మీడియా వర్గాల్లో వినబడుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు..పార్టీలోకి రావటంతో దాదాపు ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీకి ఎదురు లేకుండా పోయి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కరణం బలరాం పార్టీ మారితేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: