'మైలవరం' నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్  దేవినేని ఉమా రాజకీయం రసవత్తరంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇద్దరికిద్దరూ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు 'మైలవరం' రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. దేవినేని ఉమ.. చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ మంత్రిగా పని చేయడం జరిగింది. ఆ టైంలో అసెంబ్లీ సాక్షిగా వైయస్ జగన్ ని చాలా దారుణంగా దేవినేని ఉమా విమర్శలు చేయడం జరిగింది. అప్పుడే కాదు ఇప్పుడు కూడా మీడియా సమావేశాలలో ఎక్కడ తగ్గకుండా విమర్శలు చేస్తూ వస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో పోటీ చేసిన దేవినేని ఉమా తన చిరకాల ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో గోరంగా ఓడిపోవడం జరిగింది. ఇద్దరి మధ్య రాజకీయ రగడ ఎప్పటినుండో జరుగుతూనే ఉంది. ఇటువంటి తరుణంలో వసంత కృష్ణ ప్రసాద్ ని రాజకీయంగా ఇరుకున పెట్టడానికి దేవినేని ఉమా రాజధాని రగడ ను తెరపైకి తీసుకువచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ని దెబ్బ కొట్టాలని అనేక విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

 

అధికారంలో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం దేవినేని వేస్తున్న రాజకీయ ఎత్తుగడలకు అదిరిపోయే రీతిలో తనదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పుతున్నారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే మైలవరం నియోజకవర్గంలో కొత్తగా కొండ‌ప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ ఆవిర్భవించింది. ఈ న‌గ‌ర పంచాయ‌తీలో గెలుపు కోసం రెండు పార్టీ నేత‌లు క‌త్తులు దూసుకున్నా ఇక్కడ ఎన్నిక వాయిదా ప‌డింది. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న మైల‌వ‌రం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంప‌ట్నం మండ‌లాల్లో ఎంపీపీలు, జ‌డ్పీటీసీల్లో గెలుపు కోసం ఈ ఇద్దరు నేత‌లు కొద‌మ‌సింహాల్లా త‌ల‌ప‌డుతున్నారు.

 

అయితే గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ ప్రాంతాలలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోవడంతో దేవినేని అడుగుపెడితే కొట్టే విధంగా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉండటంతో టీడీపీ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే ముందు నుండి ఈ ప్రాంతాలలో వసంత కృష్ణ ప్రసాద్ కొద్దో గొప్పో అభివృద్ధి పనులు చేయటంతో స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యేటట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ప్రాంతాలలోనే కాదు చాలా వరకు దేవినేని ఉమా ని వ్యతిరేకించే అన్ని ప్రాంతాలలో ముందుగా అభివృద్ధి పనులు చేపట్టారు అట వసంత కృష్ణ ప్రసాద్. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ మామూలోడు కాదు...ప్రత్యర్థిని ఇంటిలోనే కూర్చోబెట్టి గెలిచేస్తున్నాడంటూ కొంతమంది మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలు చూసి చాలా మంది సీనియర్లు అంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: