నేటి రోజుని నిజంగా భారత ఇన్వెస్టర్లు బాగా గుర్తు పెట్టుకుంటారు. దీని కారణం దేశంలోని ప్రతి ఆన్లైన్ మార్కెట్లు దెబ్బకి పాతాళానికి వెళ్లాయి.  బెంచ్‌మార్క్ సూచీలు అడ్డూఅదుపు లేకుండా ఒక్క సారిగా పేకమేడ కూలిపోయినట్లు అలా పడిపోతూనే వెళ్లాయి. ముఖ్యంగా అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల సునామీ భయంకరంగా కనిపించింది. ఇన్వెస్టర్లు మహా పతనం అంటే ఏమిటో ఈరోజు వారు చూశారు. నిజానికి ఈ ఒక్క రోజే రూ.11 లక్షల కోట్లకు పైగా పోగొట్టుకున్నారు వారు.

 

IHG


ఇందుకు కారణం ముఖ్యంగా WHO కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంతో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఈ ఎఫెక్ట్ తో మన మార్కెట్‌ పై కూడా పూర్తిగా పడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 3,200 పాయింట్లకు పైగా పడిపోయింది. దీనితో 32,493 స్థాయికి చేరింది. అలాగే నిఫ్టీ కూడా ఏకంగా 950 పాయింట్లు దిగి 9,508 స్థాయికి చేరింది. సూచీలు ఒకేఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. మార్కెట్ టైం ముగిసే సరికి సెన్సెక్స్ 2,919 పాయింట్ల నష్టంతో 32,778 వద్ద, నిఫ్టీ 868 పాయింట్ల నష్టంతో 9,590 వద్ద ముగిసాయి.

 

 


ఇక ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలిసింది నిఫ్టీ - 50 లో యస్ బ్యాంక్, వేదాంత, హిందాల్కో, ఓఎన్‌జీసీ, యూపీఎల్ షేర్లు నష్టపోయాయి. ఇందులో ముఖ్యంగా యస్ బ్యాంక్ 13% మేర నష్ట పోయింది.  అలాగే నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లన్నీ కూడా నష్టాల్లో ముగిశాయి. అందులో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 13% పడిపోయింది. అలాగే అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడ్ అవుతూ 53 పైసలు నష్టంతో 74.18 వద్ద ముగిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: