రాష్ట్రం మొత్తంలో టీడీపీ పరిస్తితి ఎలా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం బాగానే ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో రెండేసి స్థానాలనే గెలుచుకున్న, ఇక్కడున్న బలమైన నాయకత్వం టీడీపీకి కలిసొస్తుంది. దాని వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీకి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు జిల్లాలకు బోర్డర్‌లో ఉన్న అవనిగడ్డ, రేపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ టఫ్ ఫైట్ ఇస్తుంది.

 

అవనిగడ్డ, రేపల్లె నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి. కాకపోతే అవనిగడ్డ కృష్ణా జిల్లా బోర్డర్‌లో ఉండగా, రేపల్లె గుంటూరు జిల్లాల్లో ఉంటుంది. మొన్న ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి వైసీపీ తరుపున సింహాద్రి రమేశ్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇక్కడ టీడీపీకి పెద్ద దిక్కుగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ఉన్నారు. ఈయన పెద్ద యాక్టివ్ లేకపోయిన టీడీపీ కేడర్ స్ట్రాంగ్‌గా ఉంది.

 

ఇప్పుడు అదే కేడర్ స్థానికంలో వైసీపీకి గట్టి పోటీ ఇస్తుంది. నియోజకవర్గంలో అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, కోడూరు, ఘంటసాల మండలాలు ఉన్నాయి. ఈ ఆరు మండలాల్లో వైసీపీకి ధీటుగానే టీడీపీ అభ్యర్ధులు ఉన్నారు. ఇదే సమయంలో ఇక్కడ జనసేన కూడా కాస్త బలంగానే ఉంది. వారి వల్ల కూడా అధికార వైసీపీకి కాస్త నష్టం జరిగే అవకాశముంది.

 

ఇక ఇటు వస్తే రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఈయన నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు..కాబట్టి రెండోసారి కూడా మంచి మెజారిటీతో గెలవగలిగారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనగాని నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలు గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. దీంతో వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీగా జరిగే అవకాశముంది. కాగా, ఈ నియోజకవర్గంలో నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, రేపల్లె రూరల్ మండలాలు, రేపల్లె మున్సిపాలిటీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: