లోకల్ బాడీ ఎన్నికలు ఇపుడు ఏపీలో రాజకీయ వేడిని రాజేసిపెట్టాయి. ఈ ఎన్నికల్లో చావో రేవో అన్న సమస్యే కనిపించడంలేదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో విపక్షాలు దాదాపుగా చేతులెత్తేసే పరిస్థితిగా ఉంది. ఒక్క మాటలో చెపాలంటే వార్ వన్ సైడ్ అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. జగన్ అన్నట్లుగా తొంబై శాతం ఫలితాలు వైసీపీకే దక్కబోతున్నాయని నామినేషన్ల అనంతర ఘట్టం తెలియచేస్తోంది.

 

అదే సమయంలో ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల తరువాత రాజకీయం ఎలా ఉంటుంది అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది. ఇప్పటికే టీడీపీని ఖాళీ చేయించే పనిలో బిజీగా ఉన్న వైసీపీ ఎన్నికల తరువాత అసెంబ్లీలో టీడీపీ లేకుండా చేస్తుందని అంటున్నారు. చంద్రబాబు తప్ప మొత్తం ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకునే భారీ స్కెచ్ ని జగన్ రెడీ చేసి ఉంచారని అంటున్నారు.

 

మాకు పదిహేడు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వైసీపీ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్న మాటలను ఒకసారి గమనిస్తే జగన్ విశ్వరూపం చూపించే రోజు దగ్గరలోనే ఉందని అంటున్నారు. అదే జరిగితే ఏపీ అసెంబ్లీలో టీడీఎల్పీ మొత్తానికి మొత్తం విలీనం అవడం ఖాయమని అంటున్నారు. అంటే ఒక్క దెబ్బకు బాబు ఉత్త ఎమ్మెల్యేగా మిగిలిపోతారన్న మాట.

 

అదే సమయంలో శాసనమండలి రద్దు కావడంతో లోకేష్ కూడా మాజీ అవుతారు. మిగిలిన వారంతా మాజీ నేతలుగా ఉంటారు. ఇందులో తమకు అవసరమైన నాయకులను కూడా వదిలిపెట్టకుండా తీసుకుని టీడీపీ మొత్తాన్ని నిర్వీర్యం చేయడానికి జగన్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. అంటే ఏప్రిల్ నెల బాబుకు చుక్కలు చూపించేలా ఉంటుందని అంటున్నారు. 

 

వరసగా సాధారణ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలు అయిన టీడీపీని ఇక ఉనికి లో లేకుండా చేసే అతి పెద్ద మంత్రాంగానికి వైసీపీ తెర తీసిందని అంటున్నారు. అన్ని రకాల ఆయుధాలను సిధ్ధం చేసుకుని మరీ పసుపు కోటను కూల్చేయబోతోందని అంటున్నారు. ఈ విషయం ముందే గ్రహించిన చంద్రబాబు జగన్ని నిందిస్తున్నారు. ఆనాడు అసెంబ్లీలో జగన్ చెప్పిన మాటేంటి, ఇపుడు ఎమ్మెల్యెలను తీసుకోవడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికల తరువాత టీడీపీని వానిష్ చేసేందుకు భారీ సీన్ రెడీ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: