ప్రస్తుతం ప్రాణాంతకమైన కరోనా  వైరస్ యావత్ ప్రపంచాన్ని ప్రాణ భయంతో గజగజ వణికి ఇస్తున్న విషయం తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇప్పటివరకు ఈ ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ 125 దేశాలకు పైగా వ్యాపించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1.29 లక్షల మందికి కరోనా  వైరస్ సోకినట్లు నిర్దారణ అయ్యింది. వీరిలో  దాదాపు 68 వేల మంది కరోనా  వైరస్ బారి నుంచి కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి 4700 మంది చనిపోయారు. మరో 5700 మంది బాధితుల పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తి మాత్రం శరవేగంగా జరుగుతోంది. 

 


 దీంతో ప్రజలందరూ కరోనా  వైరస్ ఎఫెక్ట్ వల్ల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఏం చేస్తే కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుందో అని భయపడిపోతున్నారు. ఇక జనాలను మరింత భయబ్రాంతులకు గురి చేయడానికి సోషల్ మీడియా ఉంది కదా. సోషల్ మీడియాలో కరోనా వైరస్ కు సంబంధించి ఎన్నో అసత్య ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పలువురు ప్రముఖులు కరోనా వైరస్  గురించి నిజాలు చెప్పిన నమ్మలేని పరిస్థితి. అంతలా సోషల్ మీడియా ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలలో నిజాలు కంటే అసత్యాలే ఎక్కువగా ఉంటున్నాయి. 

 

 ఇక తాజాగా మరోసారి కరోనా వైరస్ కు సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా దోమకాటుతో కరోనా  వైరస్ సోకుతుందని  ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. ఇక దోమకాటుతో కరోనా  వైరస్ వస్తుంది అని జరుగుతున్న కథనాలను కొట్టిపారేస్తున్నారు వైద్య నిపుణులు.  దోమకాటు వల్ల కరోనా  వైరస్ సోకుతుంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ స్పష్టం చేస్తున్నారు. దోమలు కుట్టడం ద్వారా కరోనా సోకే అవకాశాలు లేవని... పిఐబి  ప్యాక్ చెక్  స్పష్టం చేసింది. కరోనా  వైరస్ అనేది శ్వాసకోస కు సంబంధించిన వైరస్ అని తెలిపిన వైద్య నిపుణులు... ఇది కేవలం దగ్గు,  తుమ్ములు లాలాజలం ద్వారా మాత్రమే ఇతరులకు వ్యాప్తి చెందుతుంది అంటూ చెబుతున్నారు వైద్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: