వైఎస్ జగన్.. పది నెలల క్రితం తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. తక్కువ కాలంలోనే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే జగన్ పాలన అద్భుతంగా ఉందని.. ఆయన్ను ఇతర రాష్ట్రాల సీనియర్ సీఎంలు కూడా ఫాలో అవుతున్నారని అంటున్నారు వైసీపీ నాయకులు.

 

 

ఇంతకీ జగన్ ను ఆ సీనియర్ సీఎంలు ఏ విషయాల్లో ఫాలో అవుతున్నారో తెలుసా..

సీఎం వైయస్‌ జగన్‌ ఏపీలోని ప్రభుత్వ బడుల్లో తీసుకొచ్చిన 'ఇంగ్లిష్‌ మీడియం'ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో అవ్వాలనుకుంటున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక అధికార వికేంద్రీకరణను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అనుసరించాలనుకుంటున్నారట. అం తే కాదు.. వికేంద్రీకరణ కోసం మూడూ రాజధానుల ఏర్పాటు కోసం ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ , జార్ఖండ్ సీఎం హేమంత్‌ సొరేన్‌ కూడా ఆలోచిస్తున్నారు.

 

 

ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ అయితే ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటన చేసేశారు. ఇక దిశ చట్టం గురించి తెలపమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జగన్ ప్రభుత్వాన్ని కోరారట. కేజ్రీవాల్ తో పాటు దిశ చట్టాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారని వారు ఖుషీ అవుతున్నారు.

 

 

అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఇన్ని విప్లవాత్మక నిర్ణయాలు, చారిత్రాత్మక చట్టాలు తీసుకోవడం ద్వారా జగన్ దేశానికే దిక్సూచిగా మారారని వైసీపీ నేతలు సంబరపడుతున్నారు. జగన్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల అనుసరిస్తున్నారని ఘనంగా చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: