కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. పొరపాటున ఈ కరోనా వస్తే.. చికిత్స ఎలా.. అందుకు ఎంత ఖర్చవుతుంది.. ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్సు ఉన్నా.. ఈ కొత్త వ్యాధి కరోనాకు అందులో చికిత్స లభిస్తుందా.. లేక ప్రభుత్వ వైద్యమే దిక్కా.. ఇప్పుడు ఈ తరహా అనుమానాలు చాలా మందికి కలుగుతున్నాయి. కరోనా వస్తే వైద్యం ఎలా అన్న భయం కలుగుతోంది.

 

 

అయితే ఇలాంటి వారికి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ చికిత్సకు ఆరోగ్య బీమాను వర్తింపజేయాలని అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలను కేంద్ర బీమా నియంత్రణ సంస్థ ఆదేశించింది. అంటే మీకు ఎటువంటి ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉన్నా కూడా కరోనా వైరస్ సంబంధించిన చికిత్సను అందులో చేరుస్తారన్నమాట. కొత్త పాలసీలతో పాటు ఇప్పటికే ఉన్న పాలసీల్లో కూడా కరోనా చికిత్సను అందజేయాలని బీమా నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది.

 

 

అంతే కాదు.. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ సంబంధించి ఇప్పటికే ఉన్న పాలసీలకు కూడా వర్తింపజేయాలని, దీనిని తక్షణమే అమల్లోకి తేవాలని బీమా నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. అంతే కాదు.. కరోనా విజంభిస్తున్న దృష్ట్యా ఈ మేరకు కొత్త పాలసీలు రూపొందించాలని కూడా బీమా నియంత్రణ సంస్థ కోరింది.

 

 

కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు వైద్య ఖర్చులను భరించాలని ఐఆర్ డీఏ తన బీమా కంపెనీలను ఆదేశించింది. పాలసీ వ్యయ పరిమితి, ఇతర అంశాల్లో పాలసీ నిబంధనల ప్రకారం వ్యవహరించవచ్చని చెప్పింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: