ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ యూరప్ లో దీని ప్రభావం విపరీతంగా ఉంది. ముఖ్యంగా ఇటలీ నగరంలో కరోనా వైరస్ యొక్క ప్రభావం చాలా దారుణంగా ఉన్నట్లు అంతర్జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరు కూడా బయటికి రాకూడదని...ఎవరైనా బయటి కనబడితే కాల్చివేత ఆర్డర్స్ ఇచ్చినట్లు చెప్పటంతో బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో రోమ్ విమానాశ్రయంలో భారతీయ విద్యార్దులు 70 మంది అటూ ఇటూ కాకుండా ఇరుక్కుపోయారనే వార్తలు వినబడుతున్నాయి. వారికి కరోనా వైరస్ సోకలేదని సర్టిపికెట్ తెస్తేనే బోర్డింగ్ పాస్ లు ఇస్తామని ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్ విమానాల వారు చెబుతున్నారు.

 

కాని రోమ్ లో అలా సర్టిఫికెట్లు ఇచ్చే వ్యవస్థ పెట్టలేదట. దాంతో విమానాశ్రయంలోనే 24 గంటలుగా భారతీయ విద్యార్దులు పడిగాపులు పడుతున్నారు.వసతి, భోజన సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రదాని మోడీ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో కూడా దాదాపు 60 కి పైగానే కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఫుల్లు అలర్ట్ ప్రకటించింది. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకూడదు అని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో జపాన్ వైద్యులు కరోనా వైరస్ రాకుండా అద్భుతమైన సలహా ఒకటి ఇవ్వటం జరిగింది.

 

కరోనా వైరస్ గురించి జపాన్ డాక్టర్లు ఇచ్చిన సలహా ప్రతి ఒక్కరూ వారి నోరు గొంతు తడిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకు మంచి నీళ్లు తాగాలి. ఎందుకంటే ఒకవేళ వైరస్ మీ గొంతు లోకి వెళ్లినా, ఆ మంచి నీళ్లు వల్ల కడుపు లోకి వెళ్ళిపోతుంది. మన కడుపులో ఉన్న రసాయనాల వల్ల ఆ వైరస్ చనిపోతుంది. మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోకపోతే ఆ వైరస్ మీ శ్వాస కొసాలు మరియు ఊపిరితిత్తులు లోకి ఆ వైరస్ చేరుకునే ప్రమాదం ఉంది. ఈ జాగ్రత్త తీసుకుంటే దాదాపు వైరస్ ఒంటి మీద దాడి చేయకుండా సగానికి పైగానే మనం కాపాడుకోవడం జరుగుతుందని జపాన్ వైద్యపరంగా తెలిపింది. దీంతో ఈ జపాన్ చెప్పిన టిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: