ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ సర్కార్ మార్చి నెల చివరి లోపు ఎన్నికల కంప్లీట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఎంపీటీసీ జడ్పీటీసీ మరియు పంచాయతీ ఎన్నికలు మొత్తం ఒకేసారి కంప్లీట్ చేయడానికి రెడీ అయింది. ఉదయ తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి మంచి జోరు మీద ఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఈ ఎలక్షన్లో తిరుగులేని విజయం సాధించడంతో పాటుగా ప్రతిపక్షాలకు మరోసారి ప్రజాక్షేత్రంలో వెన్ను విరిగేలా మీరు రావడం గ్యారెంటీ అన్న డైలమాలో ఉంది. రాష్ట్రంలో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్న నేపథ్యంలో జగన్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆయా మంత్రులకు అప్పజెప్పిన వైసీపీ పార్టీలో వార్తలు వస్తున్నాయి.

 

ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నాయకులు వైసిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చాలా వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు వైసిపి పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో సరిగ్గా ఎన్నికల టైంలో జగన్ కి అదిరిపోయే షాక్ ఎన్నికల కమిషన్ నుండి వచ్చింది. స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ జగన్ సర్కార్ కి అదిరిపోయే షాక్ ఇచ్చింది. మేటర్ లోకి వెళితే ఇటీవల ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయాలని భావించింది.

 

అయితే జగన్ ప్రభుత్వ ప్రతిపాదనకు ఈసీ అడ్డంకి చెప్పింది.స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా వేసుకోవాలని వ్యక్తిగత లబ్ధి పరిధిలోకి ఈ అంశం వస్తుండడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి వీలు లేదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. అయితే అభివృధి మరియు సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలపై సీఎం జగన్ యధావిధిగా సమీక్షలు జరుపుకోవచ్చని తెలిపారు. దీంతో ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: