స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వస్తాయి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముందుగానే గ్రహించేసినట్టుగా కనిపిస్తున్నారు. అందుకే అయినా వేదాంత ధోరణితో మాట్లాడుతూనే.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఎక్కడ అధైర్యం ఏర్పడకుండా ధైర్యం చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చిన సంగతి గుర్తుపెట్టుకోండి. మళ్లీ మీ నెత్తిన ఎక్కించుకోకండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు చేస్తున్న ప్రచారం ఇది. ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లు ఇస్తే ఆ పార్టీని పట్టుకోలేమని చంద్రబాబు నాయుడు ఆవేశంతో వేడుకుంటూ ప్రజల దగ్గర సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. 


 చంద్రబాబు భయపెడుతున్నాడు ..భయపడుతున్నాడా అనేది అర్థం అవుతోంది. అంతే కాకుండా  వైసీపీ ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తోంది అని, అధికార యంత్రాంగం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని అధికార పార్టీ ఎన్నికలకు వెళ్తుందని, ఇటువంటి ఎన్నికలు నా రాజకీయ జీవితంలో చూడలేదని చంద్రబాబు చెబుతున్నారు. ఇక ఏకగ్రీవాల గురించి మాట్లాడుతూ.. ప్రజలకు ఓటు వేయాలని ఉండదా ? అని బాబు ప్రశ్నిస్తున్నారు.  వైసిపి ఎక్కడికక్కడ  దాడులకు దిగుతుందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఇంకా ఎన్నికలు మొదలు కాలేదు, అప్పుడే టిడిపి ఈ స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజలకు మరిన్ని అనుమానాలను కలిగిస్తోంది. 


ఎలాగూ ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించే విధంగా కనిపిస్తుండడంతో చాలామంది తెలుగు తమ్ముళ్ళు పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీన్ని గ్రహించిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి చోట టిడిపి అభ్యర్థులు పోటీ చేయాలని, ఎవరు ఇంట్లో కూర్చోవద్దని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఎంతమంది చెప్పినా పట్టించుకోవద్దని చంద్రబాబు పదేపదే కోరుతున్నారు. అంతేకాకుండా ఆ విధంగా ఎవరైనా పోటీ చేయకుండా ఉంటే వారిని అసమర్ధులు గా భావిస్తూ... ముందు ముందు వారికి ప్రాధాన్యత లేకుండా చేస్తామంటూ  హెచ్చరిస్తున్నారు. ఒకవైపు బెదిరింపులు, మరోవైపు వేడుకోలు ఇలా చంద్రబాబు, తనలో ఉన్న భయాన్ని ధైర్యంగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: