తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడక పోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ నాయకుల పైన విమర్శలు చేస్తూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో రేవంత్ అనుచరుల  నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సొంత అజెండాతో ఎదగాలని చూస్తున్నారని, అందుకే పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడుతున్నారు అంటూ హనుమంతరావు మండిపడ్డారు. 

IHG


సి.బి.ఐ, ఎన్ఫోర్స్మెంట్ మొదలుకొని అనేక కేసుల్లో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అని, వాటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతు ఇవ్వడం లేదంటే ఎలా అంటూ విహెచ్ మండిపడ్డారు. అసలు రేవంత్ రెడ్డి వ్యవహారంపై కోర్ కమిటీ ఏర్పాటు చేయాలని ఉత్తంకుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కలకు  సూచించినట్లుగా హనుమంతరావు చెప్పారు. రేవంత్ రెడ్డి పార్టీలో సీనియర్ నాయకులు ఎవరి మాట వినకుండా, తానొక్కడినే ఆ పార్టీలో హీరోను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, సొంత నిర్ణయాలు తీసుకుని పార్టీ పరువును దిగజారుస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


జాతీయ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ విధివిధానాల ప్రకారం ఆ పార్టీ అగ్రనేతలు చెప్పిన విధంగా నడుచుకోవాలి కానీ, రేవంత్ మాత్రం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లడం సరికాదని వీహెచ్ అన్నారు. ఇక 111 జీవో మీద పోరాటం చేసే విషయంలో రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు ఎవరిని సంప్రదించలేదని, ఒంటరిగా ముందుకు వెళితేనే తనకు సొంత ఇమేజ్ పెరుగుతుందని భావించిన రేవంత్ ఈ విధంగా పార్టీతో సంబంధం లేదు అన్నట్లు గా వ్యవహరిస్తూ అనవసర వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు అంటూ వీహెచ్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: