ఇప్పటివరకు భారతదేశంలోని చాలా నగరాల్లో కరోనా వైరస్ సోకిన బాధితులు ఉండగా భారతీయులంతా మన ఆహార అలవాట్లు కి మరియు ఇక్కడ ఉండే ఉష్ణోగ్రత కి మనకు ఏమి ప్రమాదం లేదు అని అనుకుంటూ ఉన్నారు. కానీ కరోనా మహమ్మారి భారతదేశంలో తన ప్రభావం చూపడం మొదలు పెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోతే నేడు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పరిస్థితి తీవ్రత గురించి అందరికీ తెలిసింది.  తీరా ఇప్పుడు చూస్తే మన దేశంలో కరోనా వల్ల మొట్టమొదటి మరణం సంభవించింది.

 

కర్ణాటక వాసి హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి.. చనిపోయినట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇదే భారత్‌లో నమోదైన తొలి కరోనా మృతి కావడం విచారకరం. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన వ్యక్తి మరణంతోపాటు భారత్‌లో ఇప్పటివరకూ 74కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు భయపడొద్దని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. అయితే కరోనా సోకిన ప్రతి వంద మందిలో కేవలం ముగ్గురు మాత్రమే మృతి చెందుతున్నారు. వారు కూడా ముసలివారే కావడంతో మన ప్రభుత్వం కొద్దిగా ఊపిరి పీల్చుకుంటోంది.

 

ఢిల్లీలో 6పాజిటివ్ కేసులు ఉండగా, ఉత్తరప్రదేశ్ లో 10, కర్ణాటకలో 4కేసులు, మహారాష్ట్రలో 11, లడఖ్‌లో 3, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జమ్మూ అండ్ కశ్మీర్, పంజాబ్ నుంచి ఒక్కొక్క కేసు నమోదైంది. కేరళలో అత్యధికంగా 17కేసులు ఉన్నట్లు గుర్తించారు. కేరళలో చికిత్స్ పూర్తి అయి డిశ్చార్జ్ అయిన ముగ్గురికి మరోసారి కరోనా రావడంతో మృత్యుభయంతో బతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: