ప్రపంచంలో క్రమక్రమంగా కరోనా వింజృంభిస్తుందన్న విషయం తెలిసిందే.. దీని దాటికి ఇప్పటికే ఆర్ధికపరమైన వ్యవహారాల విషయంలో అన్ని దేశాలు నష్టపోతున్నాయి.. ఎన్నో సంస్దలు మూతపడ్డాయి.. ఇక ఈ కరోనా ఎఫెక్ట్ దేవాలయాల సందర్శనల మీద సైత ప్రభావం చూపిస్తుంది.. ఇప్పటికే శబరి ఆలయ అధికారులు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుడిపైనా పడింది.

 

 

ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో.. ప్రయాణాలు చేయడానికి ప్రజలు జంకుతున్నారు. దీని కారణంగా ముఖ్యమెన పనులను సైతం వాయిదా వేసుకుంటుండగా, ఆలయ దర్శనాల విషయంలో కూడా ఆలోచిస్తున్నారు.. ఇందులో భాగంగా తిరుమలేశుడి దర్శనాన్ని సైతం వాయిదా వేసుకుంటున్న వారికి దర్శనం టికెట్లను రద్దు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

 

 

దీంతో రూ.300 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవ, వసతి బుకింగ్‌లను రద్దు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. డబ్బును భక్తులకు తిరిగి ఇస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. దర్శనాన్ని రద్దు చేసుకోవడంతోపాటు మే వరకు వాయిదా వేసుకునే సౌలభ్యాన్ని కూడా టీటీడీ కల్పిస్తోంది.. ఇక శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు..

 

 

కాగా టికెట్లను క్యాన్సిల్ చేసే విషయంలో అనుమానాలు ఉన్నవారు dyeotemple@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. పేర్కొంది... ఇప్పటి వరకు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రూ.300 టికెట్లను క్యాన్సిల్ చేసిన దాఖలు ఉన్నాయి. కానీ ఇన్ఫెక్షన్లకు భయపడి దర్శనం టికెట్లను క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పించడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.. ఇప్పటికే దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతున్న వారు తిరుమల రావొద్దని శ్రీవారి భక్తులకు అధికారులు సూచిస్తున్నారు.. కాబట్టి భకులందరు ఈ విషయాన్ని గమనించగలరు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: