తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అన్నట్టుగా జరుగుతున్న పరిణామాలు మరింత వేడెక్కాయి. త్వరలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉండడం, రేవంత్ పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హడావుడిగా ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియామకం వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. ఢిల్లీ కర్ణాటక పిసిసి అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో, తెలంగాణలో కూడా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని ఆయన సోనియాను కోరారు. తర్వాత ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను చెప్పారు. 

 

IHG


ఇక తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకు వెళతాను అనే విషయాన్ని సోనియా గాంధీ సైతం ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్ష పదవి వస్తే నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకు వస్తా అంటూ కోమటిరెడ్డి సోనియా దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి రేసులో చాలా మంది సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. అయితే తాను వాళ్ళతో రేసులో లేనని, నేను మాత్రమే రేసులో ఉన్నానంటూ కోమటిరెడ్డి చెప్పారు. నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిన వాడిని కాదని, పరోక్షంగా ఎంపీ రేవంత్ రెడ్డినీ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

 

IHG


36 ఏళ్లుగా పార్టీ లో ఉంటున్నాను కాబట్టి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని, ఒకవేళ తనకు ఇవ్వకపోతే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరికి ఇచ్చినా వాళ్లతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కోమటిరెడ్డి చెప్పారు. అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వద్దు అనే విషయాన్ని అధినేత్రి సోనియాకు చెప్పేసారు కోమటిరెడ్డి. నిన్ననే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను అధిష్టానం నియమించిన తర్వాత ఢిల్లీకి కోమటిరెడ్డి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: