ఈ మధ్య కాలంలో పలు సర్వేల్లో పెళ్లికి ముందే చాలా మంది యువతులు వర్జినిటీని కోల్పోతున్నారని తేలింది. అయితే యువతులు కోల్పోయిన వర్జినిటీని తిరిగి పొందుతున్నారని నేషనల్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. చాలా మంది యువతులు సర్జరీ ద్వారా వర్జినిటీని తిరిగి పొంది కన్యగా మారిపోతున్నారని సమాచారం. ఈ సర్జరీ కోసం యువతులు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మన దేశంలో ఇలాంటి సర్జరీలు జరగటం లేదు కానీ బ్రిటన్ లో పదుల సంఖ్యలో యువతులు సర్జరీ చేయించుకుని మళ్లీ వర్జిన్ గా చెప్పుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. 
 
ఈ మధ్య కాలంలో యువతలో చాలా మంది పెళ్లికి ముందే తొలి కలయిక అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారు. పెళ్లి చేసుకుంటామనే నమ్మకంతో పెళ్లికి ముందే తొందర పడుతున్నారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల విడిపోతూ కోల్పోయిన వర్జినిటీని తిరిగి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి శృంగారం ఆస్వాదించారంటే యువతులు వర్జినిటీని కోల్పోతారనే విషయం మనందరికీ తెలిసిందే. 
 
అమ్మాయిలు మొదటిసారి శృంగారంలో పాల్గొన్న సమయంలో హైమన్ పొర చిరిగిపోయి రక్తస్రావం జరిగి కన్యత్వం కోల్పోతారు. వైద్యులు ఈ సర్జరీలో కుట్ల ద్వారా హైమన్ పొర తిరిగి ఏర్పడేలా ఆపరేషన్లు చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత హైమన్ పొర తిరిగి ఏర్పడుతుంది. ఈ సర్జరీ చేయించుకున్న వారు మళ్లీ సెక్స్ లో పాల్గొంటే హైమన్ పొర చిరిగిపోయి రక్తస్రావం జరుగుతుంది. యువతి భాగస్వామికి ఆమె వర్జిన్ అనే అభిప్రాయం కలుగుతుంది. 
 
ఈ సర్జరీ చేయడానికి వైద్యులకు 30 నిమిషాల సమయం పడుతుంది. గత దశాబ్ద కాలంలో అధికారిక లెక్కల ప్రకారం బ్రిటన్ లో 109 మంది యువతులు ఈ సర్జరీ చేయించుకున్నారని సమాచారం. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉందని తెలుస్తోంది. ఈ సర్జరీలు ఎక్కువగా తొందరపడి తప్పు చేశామనే భావన ఉన్నవాళ్లు, పెళ్లి కాని యువతులు చేయించుకుంటున్నారని సమాచారం. అమ్మాయిలు తమ జీవితంలోకి వచ్చే అబ్బాయిలు తాము వర్జిన్ కాలేదని తెలిస్తే అస్సలు తట్టుకోలేరని అందుకే సర్జరీ చేయించుకుంటున్నామని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: