ప్రేమ పిచ్చిదంటారు.. గుడ్దిది అంటారు.. అందుకే కావచ్చూ ఈ ప్రేమకు ఎళ్లలు ఉండవు.. ఖండాంతరాలను కూడా దాటుకుంటూ వెళ్లుతుంది.. ఎక్కడో పుట్టిన వారు, ఎక్కడో పెరిగిన వారు ఈ ప్రేమలోపడి వివాహబంధంతో ఒక్కటవుతున్నారు.. అయితే మన సంప్రదాయాలకు మాత్రం విదేశీయులు ఎప్పుడు ఫీదా అవుతూనే ఉంటారన్న విషయం తెలిసిందే.. అందుకే కావచ్చూ ఇండియన్ అమ్మాయిలంటే ఫారినర్‌కు అంత పిచ్చి..

 

 

ఇందుకోసం మరీ వారి దేశంలో చేసుకోవలసిన పెళ్లిని మన భరత గడ్ద మీద చేసుకోవడానికి మొగ్గు చూపిస్తారు.. ఇదిగో తాజాగా మరో జంట ఇలాగే ఒక్కటైయ్యారు.. మనదేశ సంస్కృతి విదేశానికి చాటిచెప్పారు.. ఆ వివరాలు తెలుసుకుంటే.. ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడిన అమెరికా అబ్బాయి, నిజామాబాద్‌ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నిన్న గురువారం నిజామాబాద్‌ నగరంలోని శ్రావ్యగార్డెన్‌ వీరి వివాహానికి వేదికగా మారింది.. నిజామాబాద్‌ నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన సోమేశ్వర్‌- వరలక్ష్మి దంపతుల ప్రథమ పుత్రిక అర్చన 2010లో ఎమ్మెస్‌ చేయడానికి అమెరికా పంపించారు. కాగా 2014లో ఎమ్మెస్‌ పూర్తి చేసిన ఆమె, అక్కడే జాబ్‌ చేసుకుంటూ  గ్రీన్‌కార్డు సంపాదించింది.

 

 

ఇక జనవరి 2019 ఆన్‌లైన్‌లో మ్యాట్రిమోనీ సైట్‌లో అమెరికాలోని డెట్రాయిట్‌ మిచిగన్‌ సిటీకి చెందిన శాన్‌ విన్‌ డ్యాగ్‌ ఆమెకు పరిచయమయ్యాడు. ఇలా పరిచయమైన ఆ బంధం నెల పదిహేను రోజుల్లో ప్రేమగా మారింది. అంతే ఒకరికొకరు నచ్చడం, ఇద్దరు ఒకటిగా బ్రతకాలనుకుని నిర్ణయించుకోవడంతో వివాహం చేసుకోవాలనుకుని, కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు.

 

 

వారు ఆమోదించడంతో అమెరికాలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేయించి, తెలుగు కట్టుబాట్లతో, సంప్రదాయబద్ధంగా వీరిద్దిరి పెళ్లిని ఇండియాలో చేయాలని అనుకుని,నిజామాబాద్‌ నగరంలోని శ్రావ్యగార్డెన్‌లో నిర్వహించారు. అమెరికా నుంచి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఈనెల 6న వచ్చారు. ఈనెల 15న వారు అమెరికా వెళ్లనున్నారు. ప్రస్తుతం అర్చన ఎం ఫార్మసీ డ్రగ్‌ విభాగంలో జాబ్‌ చేస్తున్నది. పెళ్లి కొడుకు శాన్‌ విన్‌ డ్యాగ్‌ యానిమేషన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు... ఇదండి ఎల్లలు దాటిన ప్రేమకధ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: