డబ్బు గణింపు అనేది ఒక కళ చతుషష్ఠి కళలలో ధన సంపాదనను ఒక కళ గా పూర్వీకులు గుర్తించక పోయినా ఈనాటి కాలంలో డబ్బు సంపాదనను కూడ ఒక గొప్ప కళగా గుర్తిస్తున్నారు. అయితే ఈ కళ కు ఎటువంటి షాట్ కట్స్ లేకపోయినా ధన సంపాదనకు అవసరమైన విజయ సూత్రాలలో అత్యంత కీలకమైనది స్వర్ణ సూత్ర సాధన అని అంటారు.


ఈ సూత్రాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు అప్పటి తమ వారసులకు తెలియ చేసారు అన్న ప్రచారం ఉంది. వాస్తవానికి ఈ స్వర్ణ సూత్ర సాధన అన్నది ఒక మంత్రం కాదు ఒక తాత్విక అంశం చుట్టూ అల్ల బడ్డ నిజం. మంచికి చెడుకి నీతికి నిజాయితీకి మధ్య ఉన్న రేఖా మాత్రంగా కనిపించే నిజాయితీని నిజంగా తెలుసుకుని ఆచరించడమే ఈ స్వర్ణ సూత్ర సాధన అని తాత్వికులు అంటారు.


మన జీవితంలో చాల బలమైన అంశాలు బలహీనమైన అంశాలు రెండు ఉంటాయి తప్పుడు అంచనాలు కూడ ఉంటాయి. అయితే మన మనసును ప్రభావితం చేసే ఈ విషయాలకు ప్రభావితం కాకుండ స్థిర నిశ్చయంతో ఉండటమే స్వర్ణ సూత్ర సాధన. మన ఉద్దేశ్యాలు మోస పూరితంగా మన మానసిక స్థితి నిరాశాజనకంగా ఉన్నప్పుడు మనకు వచ్చే ఫలితాలు కూడ అలాగే ఉంటాయి.


‘ఇతరులు మీకు చేయకూడదు అని కోరుకున్న చెడును ఇతరులకు మీరు చేయకపోవడమే’ స్వర్ణ సూత్రంలోని ప్రధాన ధ్యేయం. అంటే ఇతరులు మీగురించి ఆలోచించి అంచనాలు వేయాలి అని అనులున్నట్లే మీరు ఇతరులు గురించి ఆలోచించండి అని స్వర్ణ సూత్రం చెపుతోంది. అంతేకాదు మన మనసు పై ఆధిపత్యం చెలాయించే ఆలోచనలను కట్టడి చేసే విద్య ను కూడ స్వర్ణ సూత్ర సాధనగా పేర్కొంటారు. ఈ ప్రాధమిక సూచనను ఎవరైతే పరిపూర్ణంగా ఆచరణలో పెడతారో వారికి ఖచ్చితంగా విజయాన్ని సంపాదించడమే కాకుండా ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంపదను సృష్టించుకో గలుగుతారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: