ప్రపంచాన్ని గాబరా పెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు వాప్యార రంగంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మాంసాహారం పై కరోనా త్రీవత ఎంతో చూపిస్తుంది.  ఒకదశలో మాంసం వ్యాపారం చేసేవారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.  సాధారణంగా ఎవరికైనా కోడి కూర అంటే ఎంతో ఇష్టం.  సామాన్యులకు అందుబాటు రేటులో ఉంటుంది.. బంధువు, స్నేహితులు వచ్చినా వెంటనే చికెన్ షాపు కి వెళ్లి చికెన్ వండి పెట్టడం చూస్తుంటాం.  కొన్ని సార్లు చికెన్ ధర ఆకాశాన్నంటుతున్న రేట్లు ఉంటాయి.  కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో వందకు మూడు కిలోలు ఇచ్చే దీన స్థితికి చేరుకుంది. చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుందన్న వదంతులు పౌల్ట్రీ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీశాయి.

 

వైరస్ భయంతో చికెన్ ప్రియులు అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడుతుండడంతో అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మాంసపై కూడా పడుతుందని అంటున్నారు.  చికెన్ వల్ల వైరస్ వ్యాపించదని అటు ప్రభుత్వాలు, ఇటు వ్యాపారులు ప్రకటనలు ఇస్తున్నా ప్రజల్లో మాత్రం నమ్మకం కలగడం లేదు.  కొన్ని చోట్ల చికెక్, ఎగ్ మేళా నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు మాత్రం ససేమిరా అంటున్నారు. అంతే కాదు చికెన్, గుడ్ల వాడకాన్ని పూర్తిగా తగ్గించేశారు. ఫలితంగా చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి.

 

ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మైలవరంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పౌల్ట్రీ వ్యాపారి గువ్వల కుమార్‌రెడ్డి తన ఫాంలోని 2 వేల కోళ్లను సమీప గ్రామాల ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు. ఇక ఏపిలో చికెన్ రేట్ల పరిస్థితి మరీ దారుణంగా పడిపోయింది.. కిలో రూ.25 నుంచి రూ. 40 అన్నా తీసుకునే పరిస్థితి లేదంటున్నారు వ్యాపారులు. ఇలా అయితే తాము వ్యాపారం చేసేది కష్టమని.. తమ కష్టాలు వెల్లబుచ్చుకుంటున్నారు వ్యాపారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: