ప్రస్తుతం కరీనా కపూర్ కంటే బాగా ఫేమస్ అయ్యింది ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తే కరోనా వైరస్ అని సమాధానం ఇవ్వచ్చు. భారత దేశంలో ఇప్పటి వరకు 73 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా ఒక వృద్ధుడు ఈ వైరస్ కారణంగా చనిపోయాడు. వృద్ధులలో ఇమ్మ్యూనిటి అనగా రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం వలన... వారు కరోనా వైరస్ బారిన పడి మృత్యువాత పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. భారతదేశంలోని యుక్తవయసులో ఉన్నవారికి చిన్నపిల్లలకి ఈ వైరస్ అసలు ప్రాణాంతకం కాదని ప్రముఖ డాక్టర్లు చెప్పడం విశేషం. ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండటం శ్రేయస్కరం అని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోవాలంటూ ఆదేశాలను జారీ చేస్తున్నాయి. ఇందులోని భాగంగానే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.




వివరాలు తెలుసుకుంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఇటలీ నుండి వచ్చిన ఓ యువకుడికి కరోనా వయసు ఉందని తేలింది. దీంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేసింది. సీఎం అదనపు కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. బయోమెట్రిక్ హాజరు వేసే క్రమంలో కరోనా వైరస్ సోకే ప్రమాదముందని ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఏపీ సర్కార్ చెబుతుంది. ఇప్పటినుండి ప్రభుత్వ కార్యాలయాలలో బయోమెట్రిక్ హాజరు బదులు ఫిజికల్ అటెండెన్స్ ని పాటించాలని అధికారులకు, సిబ్బంది లకు సూచనలు అందాయి.

 




ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సిటీలో ని ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు ఇతర కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. జె ఎన్ టి యు యూనివర్సిటీ తో సహా సిటీ లోని మిగిలిన కళాశాలలు కూడా ఈ వేలిముద్రల హాజరు విధానాన్ని నిలిపి వేసే యోచనలో ఉన్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: