తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎంతో ఆసక్తిని సంతరించుకున్న విషయం తెలిసిందే. రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వక ముందు నుంచే రాజ్యసభ స్థానాలను టిఆర్ఎస్ అధిష్టానం ఎవరికి కేటాయించబడుతుంది అనే దానిపై ఎంతో ఆసక్తికర చర్చ జరిగింది. ఇక మొన్నటి వరకు ఈ చర్చ జరుగుతూనే వచ్చింది. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా... ఈ రెండు రాజ్యసభ స్థానాలకు గాను నలుగురు పేర్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజ్యసభ స్థానాలకు గాను ప్రచారం జరిగిన పేర్లలో  ముఖ్యంగా వినిపించిన పేర్లు మాజీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత ఈశ్వర్, మాజీ ఎంపీ టిఆర్ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 

 

 

 వీరిద్దరి పేర్లు రాజ్యసభ స్థానాలు దక్కించుకుంటారు అంటూ ప్రధానంగా వినిపించాయి. ఇక గత మూడు రోజులుగా అయితే వీరికి  అధిష్టానం రాజ్యసభ స్థానాల కన్ఫార్మ్ చేసింది అంటూ  వార్తలు వచ్చాయి. కానీ రాజ్యసభ స్థానాల కోసం ఆశావహుల ఉన్నటువంటి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం నిరాశే ఎదురైంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్న ఇద్దరు సభ్యుల పేర్లు నిన్న టిఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించింది.అందులో ఒకడు సీనియర్ నాయకుడు కే కేశవరావును కొనసాగిస్తుండగా మరొకరికి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కి స్థానం కల్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక ఊహించని విధంగా  రాజ్యసభ సభ్యత్వం కోసం ఆశవహుడిగా  ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి షాక్ తగిలింది అని చెప్పాలి. 

 

 

దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులు  డీలా పడిపోయారు. అయితే తాజాగా తనకు రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడంపై స్పందించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ అభ్యర్థిత్వం దొరకలేదు అన్న నిరాశ వద్దని   ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అందరికీ శిరోధార్యమని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా ముందు స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయం పై   అభిమానులు నిరాశ పడొద్దని... త్వరలోనే మీ అందరినీ కలుస్తాను అంటూ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అభిమానులందరికీ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: