రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మరింతగా రాజుకుంది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి విషయంలో గుర్రుగా ఉంటూ వస్తున్న తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా ఇప్పుడు ఇదే అదునుగా రేవంత్ దూకుడు తగ్గించడంతో పాటు ఆయన ను  ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారంలో రేమండ్ లో ఉన్నారు.ఇదే అదునుగా కాంగ్రెస్ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్లంతా సిద్ధమవుతున్నారు. మొదటినుంచి రేవంత్ రెడ్డి పార్టీ ఎదుగుదల కంటే తన సొంత రాజకీయ ఎదుగుదల కోసమే ప్రయత్నించారని, సొంత ఎజెండాతో పనిచేస్తూ పార్టీకి తీరని నష్టం చేకూర్చారని కాంగ్రెస్ సీనియర్లు వి. హనుమంతరావు, జగ్గారెడ్డి తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

 

IHG


 సొంత అజెండాతో ముందుకు వెళ్తున్న రేవంత్ ఏ విధంగా మద్దతు ఇస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఏవైనా ఉంటే పద్ధతి ప్రకారం పోరాడాలని, ముందుగా పార్టీలో అందరి అంగీకారంతో కలిసి ముందుకు వెళ్తే ఎటువంటి సమస్య ఉండదని, కానీ రేవంత్ మాత్రం తన సొంత పరపతినిపెంచుకునేందుకు ఎవరికీ చెప్పకుండా ఇలా వివాదాల్లో దూరి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు అన్నట్టుగా మాట్లాడుతుండడం కరెక్ట్ కాదని వారు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి  భూ అక్రమాలు గురించి కూడా చర్చించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆ పార్టీ నిండా ముంచిన రేవంత్ ఇప్పుడు అదే దుస్థితిని కాంగ్రెస్ కు తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

IHG


 పిసిసి అధ్యక్ష పదవిపై ఎప్పటి నుంచో ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారని అందుకే ఇప్పుడు తెలంగాణ ఈ విధంగా చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా రేవంత్ రెడ్డి వ్యవహారం పై మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలనే విషయంలో తమ విభేదాలను సైతం పక్కనపెట్టి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా ఏకతాటిపై వచ్చి రేవంత్ కు వ్యతిరేకంగా గొంతు పెంచుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: