ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా  భయం కనిపిస్తున్న  విషయం తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తోంది. అయితే చైనాలో మొన్నటివరకు మరణ మృదంగం మోగించిన ఈ  ప్రాణాంతకమైన కరోనా ... ఇప్పుడు చైనాలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇతర దేశాల్లో మాత్రం విజృంభిస్తుంది అనే చెప్పాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలకు పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ వ్యాపించింది. ఎన్ని  ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా  వ్యాప్తి మాత్రం శరవేగంగా జరిగిపోతుంది. కరోనా  వైరస్ సోకి ప్రాణాలు పోవడం ఏమోగానీ... కరోనా వైరస్  నేపథ్యంలో వస్తున్న పుకార్లు మాత్రం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

 

 

 

 ముఖ్యంగా దోమ కుడితే కరోనా వైరస్ వస్తుందని... లేదా చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందని... మొబైల్ ఎక్కువ వాడినా కరుణ వైరస్ వస్తుందని... ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి . దీంతో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనే అయోమయంలో పడిపోయారు జనాలు. రోజురోజుకు జనాలలో కరోనా  భయం ఎక్కువ అవుతుండడంతో... సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్ని  నమ్ముతున్నారు. కరోనా  వైరస్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం అయినా వార్త ఏది అంటే చికెన్ తింటే కరోనా  వైరస్ సోకుతుందని . పౌల్ట్రీ పరిశ్రమల కోళ్ళకి కరోనా వైరస్ ఉందని... చికెన్ తినవళ్ళకి కరోనా  సోకడం ఖాయం అంటూ సోషల్ మీడియా  లో ప్రచారం జరుగుతోంది. 

 

 

 అయితే ఇది అసత్య ప్రచారమని ఎంతోమంది అవగాహన కల్పించినప్పటికీ... చికెన్ తింటే కరోనా వైరస్  రాదు అని ప్రముఖులు సూచించినప్పటికీ ప్రజల్లో మాత్రం ఈ భయం పోవడం లేదు. ఈ నేపథ్యంలో చికెన్ తింటే ఎక్కడ కరోనా  సోకుతుందోనని చికెన్  వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు జనాలు. కరోనా  భయంతో జనాలందరూ చికెన్ తినడం తగ్గించడంతో పౌల్టీ వ్యాపారులు అందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఇక కొంతమంది వ్యాపారులు అయితే కోళ్లను ఉచితంగా కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ లోని కృష్ణా జిల్లా మైలవరం మండలం చిలుకూరువారిగూడెం కి చెందిన గువ్వల కుమార్ అనే వ్యాపారి... తన పౌల్ట్రీ ఫారం లోని 2000 కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: