కరోనా ఎవ్వర్నీ వదలటం లేదు.. సామాన్యుడి నుండి దేశాధినేతల వరకు వణికిపోతున్నారు. స్కూల్‌ కార్యక్రమాల నుండి అంతర్జాతీయ సమావేశాల వరకు వాయిదా పడుతున్నాయి. అటపాటల్లేవ్‌.. సభలు సమావేశాల్లేవు.. పెళ్లి పేరంటాలు వాయిదా పడుతున్నాయి. 

 

కరోనా వైరస్ సామాన్యులతో పాటు దేశాధినేతలను, మంత్రులను కూడా వణికిస్తోంది. ఇప్పటికే ఇరాన్, బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రులకు కరోనా వైరస్ సోకింది. లేటెస్ట్‌ గా కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీకి కూడా కరోనా వైరస్ సోకినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. గురువారమే ఆమెకు కరోనా వైరస్ సంబంధిత లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమె ఇంట్లోనే ఉన్నారు. దీంతో జస్టిన్ కూడా ఇంటి నుంచే పనిచేశారు. సోఫీ ఇటీవలే బ్రిటన్‌లో ఓ కార్యక్రమానికి హాజరై వచ్చారు. అక్కడే ఆమెకు వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
కెనడాలోనే కాదు... బ్రిటన్‌, అమెరికా, ఇరాన్‌ తో సహా అనేక దేశాల్లో ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. 

 

అటు అమెరికాలో న్యూయార్క్ నుండి కాలిఫోర్నియా వరకు కల్చరల్ సెంటర్స్ అన్నీ మూసేశారు. డిస్నీలాండ్ ని షట్ డౌన్ చేశారు. బ్రాడ్వే లో థియేటర్లు తెరవటం లేదు. మార్చ్ 31 వరకు ఒక్కదానిలో కూడా ఈవెంట్స్ జరగటం లేదు.

 

అమెరికా కాంగ్రెస్ హౌస్, సెనేట్ ఆఫీస్ బిల్డింగ్స్, వైట్ హౌస్ లకు ఏప్రిల్ 1 వరకు పబ్లిక్ ఎంట్రీ నిషేధించారు. ఫ్రాన్స్, ఐర్లాండ్, డెన్మార్క్, నార్వే, లిథువేనియా, అల్జీరియా, స్లోవేకియా దేశాలు స్కూళ్లను మూసేశాయి. యూరప్ కు చెందిన ప్రముఖ సాకర్ టీమ్ రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లంతా క్వారంటైన్ లో ఉన్నారు. ఈ టీమ్‌ లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. చెక్ ప్రభుత్వం బ్రిటన్ తో సహా 13  యూరప్ దేశాల పౌరుల రాకపోకలపై నియంత్రణలు, నిషేధం విధించింది. స్లోవేకియా అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసేసింది.

 

హాలీవుడ్ స్టార్ టామ్ హ్యాంక్స్ తో పాటు, అతని భార్య రీటా విల్సన్ కు కూడా కరోనా పాజిటివ్ రావటంతో హాలీవుడ్ ఎలర్టయింది. ఆఖరికి బాండ్ సినిమాకు కూడా కరోనా సవాల్‌  విసిరింది. ఓవరాల్‌ గా చైనాలో వుహాన్‌ లో పుట్టి...ఇటలీ, ఇరాన్‌, అమెరికా, సౌత్‌ కొరియా, స్పెయిన్‌ ....ఇలా ఒక్కే దేశాన్ని ఆటాడుకుంటోంది కరోనా. అన్ని దేశాలు తక్షణ నిబంధనలు, నియంత్రణలు, నిషేధాలతో కరోనాను అంతం చేసే పనుల్లో బిజీగా ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: