ప్రస్తుతం ఏపిలో జరుగుతున్న పరిణామాల గురించి ప్రతిరోజూ హాట్ టాపిక్ గా నడుస్తుంది.  గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయి.. వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.  ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలనలో దూకుడు పెంచారు.  రాష్ట్రాభివృద్ది విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారు.  ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ప్రజలకు ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేరుస్తూ వస్తున్నారు.  ఇలా ఆయన పాలన చూసి ప్రజలే కాదు.. ఇప్పుడు ఇతర పార్టీ నేతలు ఒక్కొక్కరూ వైసీపీలోకి వలస వస్తున్న విషయం తెలిసిందే. టీడీపి కి చెందిన ముఖ్యనాయకులు వైసీపీలో జాయిన్ అవుతున్నారు. 

 

త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఇక టీడీపీ ఖేల్ ఖతం అంటున్నారు వైసీపీ నేతలు. ఇదిలా ఉంటే.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ‘కోడ్’ ఉల్లంఘన జరుగుతోందని, అధికార పార్టీ దాడులు చేస్తోందని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై  స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో జరిగి గొడవలపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని.. ఇందికు కారణం ఎవరైనా సరి కఠినంగా శిక్షించాలని కోరామని.. అయితే ఇది చంద్రబాబు కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

 

చంద్రబాబు కి సీఎం జగన్, నాపై లేనిపోని ఆరోపణలు చేయడం మాత్రమే తెలుసని.. ప్రజా సంక్షేమాలు ఏమీ కనిపించడం లేదని అన్నారు.  రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారని.. అలాంటి ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని అన్నారు. ఇలా అయితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా నిలుపుకునే పరిస్థితి లేదని.. ఆయన వ్యవహారం చూసి విసుగు వచ్చి ఎమ్మెల్యేలు బయకు వచ్చినా ఆశ్చర్యం లేదని.. పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: