తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డియర్ నెస్ అలవెన్స్ (డీఏ ) పెంచుతున్నట్లు మోడీ సమక్షంలో క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. నిత్యావసర సరుకులు పెరగడం వలన డీఏ అనగా కరువుభత్యం 4 శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షన్ దారులకు నేడు తీపి కబురు చెప్పింది. సో, పెరిగిన డీఏ వలన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్ దారులకు లబ్ధి చేకూరుతుందని తెలుస్తుంది .





నాలుగు శాతం పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్యాడర్ ని బట్టి రూ. 720 నుండి రూ. 10, 000 వరకు సాలరీ ఎక్కువగా వస్తుంది. పెరుగుదల జనవరి 1, 2020 నుండి అమలవుతుంది. అంటే గడిచిపోయిన జనవరి, ఫిబ్రవరి నెలలకు కూడా పెరిగిన డీఏ లని కలిపి మార్చి నెల జీతంలో అందిస్తారని తెలుస్తుంది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నెలకు పదివేల రూపాయలని శాలరీ గా తీసుకుంటే... పెరిగిన డీఏ వలన అతనికి 720 రూపాయలు అధికంగా వస్తాయి. ఇక కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తూ ఎక్కువ జీతాన్ని పొందుతున్న వారికి నెలకి రూ. 10, 000 అదనంగా లభిస్తాయి.

 




ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం డీఏ ని పెంచుతూ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం 2020 అర్థ సంవత్సరానికి డీఏ ని పెంచుతూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. యూనియన్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ ప్రభుత్వం డీఏ ని నాలుగు శాతం పెంచిందని, దీని వల్ల బేసిక్ పే యొక్క డియర్ నెస్ అలవెన్స్ 17 శాతం నుండి 21 శాతం వరకు పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కొత్తగా పెరిగిన డియర్ నెస్ అలవెన్స్ వలన కేంద్ర ఖజానాలో నుండి 14,500 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: