చివరకు తెలుగుదేశంపార్టీలో జేసి బ్రదర్స్ బతుకు ఇంత దీనంగా తయారవుతుందని ఎవరూ ఊహించలేదు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో పోటి చేయటానికి తమ మద్దతుదారులకు 10 డివిజన్లు కేటాయించాలని జేసి పనవ్ ఎంతగా బతిమలాడుకున్నా పార్టీ అధిష్టానం అంగీకరించలేదు. ఇక్కడ పార్టీ అధిష్టానం అంటే ముందు మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏగా ఓడిపోయిన ప్రభాకర్ చౌదరినే చెప్పుకోవాలి. జేసి దివాకర్ రెడ్డికి చౌదరికి మొదటి నుండి ఉప్పు-నిప్పుగానే ఉంది సంబంధాలు.

 

మొన్నటి ఎన్నికల్లో చౌదరి గెలుపుకు ఎంపిగా పోటి చేసిన పవన్ రెడ్డి, పవన్ రెడ్డికి ఓట్లేయించేందుకు చౌదరి ఎక్కడా సహకరించుకోలేదు. దీని ఫలితంగా ఇద్దరు ఓడిపోయారు. సరే పార్టీకి కూడా ఘోరంగా ఓడిపోయినా ఇప్పటికీ వీళ్ళమధ్య వివాదాలైతే అలాగే నడుస్తున్నాయి. ఎలాగూ మాజీ ఎంఎల్ఏనే కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో అభ్యర్ధుల ఎంపిక బాధ్యత చౌదరిపైనే పెట్టింది అధిష్టానం.

 

ఎప్పుడైతే అభ్యర్ధుల ఎంపిక తన చేతికే వచ్చిందో మొత్తం అభ్యర్ధులను తన మద్దతుదారులతోనే చౌదరి  భర్తీ చేస్తున్నాడు. దాంతో పవన్ రెడ్డికి కూడా మండింది. మున్సిపల్ కార్పొరేషన్లో పోటి చేసేందుకు తమ మద్దతుదారులకు కూడా పది డివిజన్లు కేటాయించాలని పట్టుబట్టాడు. జిల్లా నేతల ముందు పంచాయితీ వచ్చినా పరిష్కారం కాలేదు. పైగా పవన్ వర్గానికి టికెట్లు కేటాయించాలని తనపై ఒత్తిడి తెస్తే తాను పార్టీకే రాజీనామా చేసేస్తానని చౌదరి వార్నింగ్ ఇవ్వటంతో  ఏమి చేయాలో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఎవరేమనుకున్నా తనకు అనవసరమని చౌదరి ఇప్పటికే తన మద్దతుదారులతో 40 డివిజన్లలో నామినేషన్లు కూడా వేయించేశారు. మిగిలిన పది డివిజన్లనైనా తనకు ఇప్పించమని పవన్ బతిమలాడుతున్న ఎవరూ పట్టించుకోవటం లేదు. ఈ విషయంలో కలగజేసుకున్నా ఉపయోగం ఉండదని జేసి దివాకర్ రెడ్డి మౌనంగా ఉండిపోయారట. మరి మిగిలిన పది డివిజన్ల విషయం ఏమవుతుందన్నది వేరే విషయం. మొత్తానికి జేసిల బతుకు మాత్రం పార్టీలో ఇంత దయనీయంగా మారిపోయిందేమిటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: