ఆఖరుకు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందని తమ్ముళ్ళే అనుకుంటున్నారు. ఏ ఒక్కటీ ఒక పట్టాన తేల్చని బాబుకు ఇపుడు బాగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటో సీన్ బాగా అర్ధమయ్యాక బాబుకు ఏం చేయాలో తోచడంలేదుట.

 

అందుకే జగన్ ఏం చేస్తే అదే చేయడాన్ని అలవాటు చేసుకున్నారని అంటారు. గత ఎన్నికల నుంచి కూడా ఆయన చేస్తున్నది అదే. అప్పట్లో మొత్తానికి మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్ధులను ఒక్కసారిగా ప్రకటించిన జగన్ మొనగాడు అనిపించుకున్నారు. చంద్రబాబు మాత్రం విడతల వారీగా పేర్లు ప్రకటించి చివరికి 23 మందిని మాత్రమే గెలిపించుకోగలిగారు.

 


ఇవన్నీ ఇలా ఉంటే లోకల్ బాడీ ఎన్నికల్లో చంద్రబాబు తన పార్టీ అభ్యర్ధుల ఖరారు విషయాన్ని లోకల్ లీడర్లకు వదిలేకుండా రాజముద్ర తనదే ఉండేలా చూసుకుంటున్నారు. ప్రత్యేకించి విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో బాబు ఆచీ తూచీ అభ్యర్ధులను ఎంపిక‌ చేస్తున్నారుట.

 

మరో వైపు వైసీపీ విశాఖలోనే లిస్ట్ తయారు చేసి అక్కడే రిలీజ్ చేసి  నామినేషన్ల ఘట్టం ముగియకుండానే మొత్తం అభ్యర్దులను  ప్రకటించేసింది. టీడీపీ మాత్రం నామినేషన్ ఘట్టం ముగిసాక కూడా ఇంకా వడపోత పనిలోనే  ఉంది. లిస్టులు అన్నీ కూడా అమరావతిలో కూర్ఛుని  బాబు చూస్తున్నారుట. ప్రతీ వార్డులో వైసీపీ ఎవరిని నిలబెట్టింది చూసుకుని మరీ అక్కడ తమవారిని ఎంపిక చేస్తున్నారుట.

 

అలా బాబు ఎంత కాపీ కొట్టినా విజయం తమదేనని వైసీపీ నేతలు అంటున్నారు. బాబు అభ్యర్ధులు బయటపడేసరికి సగం ఎన్నికల కాలం గడచిపోతుందని మరో వైపు తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. నామినేషన్ల ఉపసం హరణ ముందు వరకూ టైం ఉంటుంది కాబట్టి అపుడు బీఫారాలు ఇచ్చేలా టీడీపీ ప్లాన్ చేసిందట. 

 

ఇలా ఎంపికకే పుణ్యకాలమంతా గడిపేస్తే జనాల్లోకి ఎపుడు వెళ్ళేది, ఓట్లు ఎపుడు అడిగేది అని తమ్ముళ్ళు చిందులు తొక్కుతున్నారు. మరో వైపు టికెట్ వస్తుందని నమ్మకం లేని వారు ఇతర పార్టీల నుంచి అపుడే నామినేషన్లు కూడా వేశేసారు. ఇన్ని చేసినా జీవీఎం సీ కిరీటం టీడీపీకి దక్కుతుందా అన్నదే పెద్ద డౌట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: