సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి అధికారంలో ఉన్న వైసీపీ...స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దుమ్ములేపేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు దక్కించుకుని సత్తా చాటడం ఖాయమైపోయింది. ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ నామినేషన్లలోనే ప్రతిపక్ష టీడీపీ చేతులెత్తేసింది. దీంతో వైసీపీకి ఎక్కువ ఏకగ్రీవ విజయాలు దక్కనున్నాయి. అలాగే ఎన్నికల జరిగే స్థానాల్లో సూపర్ విక్టరీ కొట్టేలా ఉంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏకపక్షంగా విజయం సాధించనుంది.

 

ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలకు పోటీగా కంచుకోటగా ఉన్న నెల్లూరులో కూడా వార్ వన్‌సైడ్ కానుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ సీటుని గెలుచుకుని వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు కష్టపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు.

 

అయితే ఈ జిల్లాలో టీడీపీ నేతలు పోటీ ఇచ్చే పరిస్తితిలో కనిపించడం లేదు. ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు ఇంకా పూర్తిగా పనిచేయడం మొదలుపెట్టకపోవడం వల్ల, స్థానికంలో టీడీపీకి ఘోర ఓటమి ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఏదో జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రయాదవ్ తనకు సాధ్యమైన వరకు కష్టపడుతున్నారు. అటు సర్వేపల్లిలో మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి దూకుడు ముందు సోమిరెడ్డి తేలిపోతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతల పరిస్తితి మరి ఘోరంగా ఉంది.

 

ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక ఎలాగో జరగడం లేదు కాబట్టి, మంత్రి అనిల్ కుమార్ జిల్లాలో మిగతా స్థానాల్లో వైసీపీ విజయంపై ఫోకస్ పెట్టారు. అలాగే మంత్రి గౌతమ్ రెడ్డి తన నియోజకవర్గం ఆత్మకూరులో వైసీపీని మెజారిటీ స్థానాల్లో గెలిపించాలని చూస్తున్నారు. ఇటు నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కొవ్వూరులో నల్లపురెడ్డి, సూళ్ళూరుపేటలో కిలివేటి సంజీవయ్య, గూడూరులో వరప్రసాద్, వెంకటగిరిలో ఆనం రామ్ నారాయణరెడ్డిలు ఏకపక్షంగా వైసీపీ జెండా ఎగరవేయడానికి కష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: