స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార వైసీపీ హవా కొనసాగేలా కనిపిస్తోంది. అయితే వైసీపీకి ప్రతిపక్ష టీడీపీ కొన్ని జిల్లాలో టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉంది. అలా టీడీపీకి టఫ్ ఫైట్ ఇస్తున్న జిల్లాల్లో కృష్ణా ముందు వరుసలో ఉంటుంది. ఈ జిల్లాలో టీడీపీ బలంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిన బలమైన కేడర్ ఉండటం వల్ల, వైసీకి టఫ్ ఫైట్ ఇస్తుంది.

 

ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు, మున్సిపల్స్‌లో కూడా కొన్ని చోట్ల గెలిచేలా ఉంది. అసలు వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది ఎక్కడ? ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉందనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే..జిల్లాలో రెండు కార్పొరేషన్స్ ఉన్నాయి. విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్స్‌లో రెండు పార్టీలు హోరాహోరీగానే తలపడుతున్నాయి. అయితే విజయవాడలో టీడీపీకి ఎడ్జ్ ఉంటే, మచిలీపట్నంలో వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఇక మున్సిపాలిటీ, నగర పంచాయితీల విషయానికొస్తే పెడనలో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచిన కాస్త టీడీపీకి అనుకూల వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు వుయ్యూరులో టీడీపీ-వైసీపీల మధ్య గట్టి పోటీ ఉంది. అలాగే తిరువూరు, నూజివీడులలో కూడా పోటీ ఉన్న, ఈ రెండు చోట్ల వైసీపీకే గెలిచే అవకాశాలున్నాయి. అటు నందిగామలో టీడీపీ-వైసీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే మెజారిటీ స్థానాల్లో వైసీపీకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.

 

అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. అయితే రాజధాని అమరావతి ప్రభావం జిల్లాపై ఎక్కువ ఉండే అవకాశముంది. ఇది టీడీపీకి ప్లస్ అయ్యేలా ఉంది. ఒకవేళ ఎన్నికల్లో కృష్ణా జిల్లా ప్రజలు రాజధాని అంశం చూసి ఓటు వేస్తే ఖచ్చితంగా టీడీపీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తోంది. లేదంటే వైసీపీకే ఆధిక్యం రానుంది. కాగా, గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: