ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి వైసీపీ, టీడీపీ పార్టీలతో పాటు జనసేన బీజేపీ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఏపీలో తమకు బలం అంతంత మాత్రమే అని తెలిసినా ఏపీ బిజెపి నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల సమరంలోకి దూకారు. వైసిపి బలం ఎక్కువగా ఉండడం, మళ్ళీ తమకు గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉండడంతో ఏపీ బీజేపీ నేతలతో పాటు జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని నుంచి బయటపడేందుకు ఇప్పుడు ఏపీలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

 

IHG


 ఎన్నికల అధికారులను వైసిపి నాయకులు బెదిరిస్తున్నారని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలి అంటూ పోలీసులు బెదిరిస్తున్నారని బీజేపీ ఎంపీలు అమిత్ షా  దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు చెప్పినా వైసీపీ పార్టీ రంగులను ప్రభుత్వ ఆఫీసుల మీద నుంచి తొలగించలేదు అని, ఎన్నికల సంఘం కూడా సక్రమంగా స్పందించడం లేదని, ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అని, కేంద్రం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటామంటూ అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ప్రకటించారు. పోలీసుల తీరుపై నిఘా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. 

 

IHG


విజయనగరం జిల్లాలో ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. బిజెపి వ్యాఖ్యలకు టిడిపి కూడా జత కలిసింది. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలంటూ టిడిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు గవర్నర్ కు ఫిర్యాదు చేశామని, అయినా ఎటువంటి స్పందన కనిపించలేదని, టిడిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందో లేక జగన్ తో దోస్తీ కారణంగా ఏపీ బీజేపీ నాయకులు టీడీపీ చేస్తున్న ఆరోపణలను తేలిగ్గాతీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: