తమిళ నటుడు విజయ్‌... కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల ఆయన ఇంటిపై ఐటీ సోదాలు ఫ్యాన్స్‌ను ఆందోళకు గురి చేసింది. మరోవైపు ఆయన సక్రమంగా ట్యాక్స్‌ కడుతున్నాడా అనే సందేహాలకు తెరలేచింది. ఇంతకీ సోదాలు చేసిన ఐటీ అధికారులు తేల్చేందేమిటి?

 

తమిళ నటుడు విజయ్‌కు మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతని సినిమా రిలీజైందంటే భారీ కలెక్షన్లు గ్యారెంటీ. దీనికి తగ్గట్టుగానే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్నాడు విజయ్‌. బిగిల్‌ చిత్రానికి 50 కోట్లు తీసుకుంటే... మాస్టర్‌కు 80 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. సినిమా సినిమాకు... దానిని భారీగా పెంచేస్తున్నాడనేది ఇండస్ట్రీ టాక్‌.  

 

భారీగా రెమ్యునరేషన్‌ తీసుకునే విజయ్‌... సక్రమంగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కడుతున్నాడా? లేదా? అనేది చాలా మంది సందేహం. ఆఖరికు ఐటీ అధికారులకు కూడా అదే డౌట్ వచ్చింది. దీంతో ఇటీవల కాలంలో ఆయన ఇంటిపై పలు సార్లు దాడులు చేశారు అధికారులు.

 

బిగిల్‌ సినిమాకు సంబంధించి ట్యాక్స్‌ ఎగవేత ఆరోపణలతో గత నెలలో విజయ్‌ ఇంట్లో సోదాలు చేశారు.  ఏజీఎస్ సంస్థలోనూ తనిఖీలు నిర్వహించారు. డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు... సరైన పత్రాలు చూపించడం లేదంటూ విజయ్‌ నటిస్తున్న మాస్టర్ సినిమా షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు. అక్కడ విజయ్‌ను ప్రశ్నించారు. విజయ్‌ను కావాలనే అధికారులు టార్గెట్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజయ్‌ కూడా సెటైర్లు వేశాడు.

 

తాజాగా మరో సారి సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. చెన్నైలోని విజయ్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. దీంతో  ఏం జరుగుతుందో ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. విజయ్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని పత్రాలు తనిఖీ చేసిన అధికారులు... పన్ను చెల్లింపులో అతను పర్ఫెక్ట్‌ అని తేల్చేశారు. విజయ్‌ పన్నులు ఎగవేయలేదని స్పష్టం చేసింది ఐటీ శాఖ. బిగిల్‌, మాస్టర్‌ సినిమాలకు సంబంధించి కూడా మొత్తం ట్యాక్స్ చెల్లించాడని  ప్రకటించింది. విజయ్‌ ఇంటిపై వరుసగా జరుగుతున్న ఐటీ సోదాలతో ఒకొంత ఆందోళన చెందిన ఆయన ఫ్యాన్స్‌... అన్నీ సక్రమంగానే ఉన్నట్టు తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: