తెలుగుదేశం పార్టీ ని వీడేందుకు మరొక కుటుంబం రెడీ అయిపొయింది . పార్టీ అధికారం లో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు , ఇప్పుడు మాత్రం తమని పార్టీ నాయకత్వం ఖాతరు చేయలేదన్న సాకును చూపెడుతూ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు . అదే  తరహా లో అనంతపురం జిల్లా శింగనమల చెందిన తల్లి, కూతుళ్లు శమంతకమణి , యామినీబాల లు త్వరలోనే టీడీపీ కి గుడ్ బై చెప్పే అవకాశాలు లేకపోలేదన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి . ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు  ఆ పార్టీ ని వీడి వైస్సార్ కాంగ్రెస్ గూటికి చేరుతున్న విషయం తెల్సిందే .

 

అదే తరహాలో శమంతకమణి తన కూతురు తో కలిసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే  యామినీబాల ను  కాదని జేసీ సోదరుల సిఫార్సు మేరకు బండారు శ్రావణికి టీడీపీ అధినేత చంద్రబాబు ఆ స్థానాన్ని  కేటాయించారు . తన కూతురు కు కాదని శ్రావణి కి టికెట్  కేటాయించడం పట్ల  శమంతకమణి తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది . అందుకే ఇటీవల పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును వ్యతిరేకించేందుకు  మండలి హాజరుకావాలంటూ టీడీపీ జారీ చేసిన విప్ ను కూడా ఆమె  ఖాతరు చేయలేదని సమాచారం .

 

ఒకవైపు మండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ,  అసెంబ్లీ ఎన్నికల్లో తన కూతురు కు సిట్టింగ్ స్థానాన్ని  కేటాయించకపోవడం తో , ఇక టీడీపీ లో కొనసాగి లాభం లేదని శమంతకమణి భావిస్తున్నారని సన్నిహితులు అంటున్నారు . అందుకే కూతురి రాజకీయ  భవిష్యత్తు కోసం  ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించారని చెబుతున్నారు . త్వరలోనే  కూతురు తో కలిసి టీడీపీకి శమంతకమణి  గుడ్ బై చెప్పి వైస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: