తెలంగాణలో రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీలోకి వచ్చిన తర్వాత మరోసారి అభివృద్ది పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అభివృద్ది చెందాలంటే  ఇన్ కమ్ ఎంతో ముఖ్యమంటున్న కేసీఆర్ .. కరెంట్ చార్జీలతో పాటు, ప్రాపర్టీ టాక్స్ కూడా పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీలోనే క్లారిటీ ఇచ్చారు. అయితే, ఎంతపడితే అంత పెంచడం కాకుండా.. నిరుపేదలకు ఇబ్బంది లేకుండా ఇవి పెంచనున్నట్టు తెలిపారు కేసీఆర్. అసెంబ్లీలో పల్లె ప్రగతి కార్యక్రమంపై మాట్లాడిన కేసీఆర్.. 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం  ఒక్కటే అన్నారు. 

 

విద్యుత్ చార్జీలను పెంచిన నాటి నుంచే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పతనం ప్రారంభమౌతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో విద్యుత్ చార్జీలు పెంచకతప్పదని సీఎం కేసీఆర్ ప్రస్తావించిన అంశంపై కోమటిరెడ్డి మండిపడ్డారు.   ఇక, ఓట్ల కోసం భయపడడం మానేశాం.. ఎన్నికల్లో ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న ఆయన.. అభివృద్ధిపైనే తమ దృష్టంతా అని స్పష్టం చేశారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో ప్రాపర్టీ టాక్స్ పెంచబోతున్నాం.. నిరుపేదలకు ఇబ్బంది లేకుండా పెంచుతాం.. అదే విధంగా మున్సిపాలిటీల్లోనూ టాక్స్ పెంచాల్సి ఉందన్నారు కేసీఆర్. 

 

స్వార్ధం, తమ వ్యక్తిగత లాభాల కోసం ఎక్కువ ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసి జెన్‌కో నష్టాల బాట పట్టించిన కేసీఆర్‌ తన తప్పులను ప్రజలపై రుద్దాలని చూడటం అత్యంత దారుణమని అన్నారు. అన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత త్వరలో విద్యుత్‌ చార్జీలను పెంచుతామని ప్రకటించిన కేసీఆర్‌ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నాడని. ఓట్లు – ఎన్నికలు తప్పితే కేసీఆర్‌కు ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదన్న అంశం గుర్తించాలని ఆయన నేడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌ కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన చరిత్ర ప్రజలకుందన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తుపెట్టుకోవాలని వెంకట్‌రెడ్డి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: