ఏపీ సీఎం జగన్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అది కూడా చాలా మంచి వార్త.. అదేంటంటే.. పోలవరం అంచనా వ్యయాన్ని దాదాపుగా చెల్లించేందుకు కేంద్రం ఓకే చెప్పేసింది. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ. 55, 545 కోట్లు.. ఇందులో రూ. 48 వేల కోట్ల వ్యయం చెల్లించేందుకు ఓకే చెప్పేసింది. ఈ మొత్తానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

 

 

వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొత్తం పూర్తిగా కేంద్రం నిధులతోనే కడతామని కేంద్రం ఇది వరకే హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పరహారం కింది పోలవరం నిర్మాణ వ్యయం భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే కేంద్రం మాటలు అమల్లోకి రావడం అంత సులభం కాదు. అందుకే గత ఐదేళ్లలో కేంద్రం ఇప్పటి వరకూ కేవలం రూ. 16 వేల కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించింది. ప్రస్తుతం పోలవరం పనులు జోరుగా సాగుతున్నాయి.

 

 

గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2018 నాటికే పోలవరం పూర్తి చేస్తానని చాలాసార్లు చెప్పినా అది సాధ్యపడలేదు. ఇప్పుడు జగన్ సర్కారు 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్నారు. అసలే నిధుల కొరత.. దీనికి తోడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా నిధుల లభ్యత కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో కేంద్రం దాదాపు 48 వేల కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపడం చాలా ఊరటనిచ్చే అంశం.

 

 

ఇప్పటి వరకూ కేవలం ప్రాజెక్టుపైనే దృష్టి సారించిన రాష్ట్రప్రభుత్వం అసలైన పురావాసంపై దృష్టి పెట్టాలంటే.. నిధులు అవసరం. ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలిపిన నిధులు వస్తే.. పోలవరం నిర్మాణం చకచకా సాగే అవకాశం ఉంది. ఎలాగైనా సరే 2021 నాటికి పోలవరం పూర్తి చేసి చూపించాలని జగన్ సర్కారు పట్టుదలతో ఉంది. కేంద్రం సహకరిస్తే అది సాధ్యమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: