ప్రపంచాన్ని గజ్జున వణికిస్తున్న కరోనా ఇప్పుడు ఎక్కడ చూసినా మరణాల భయాన్ని సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా తర్వాత ఇటలీలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో ఇటలీ లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా చైనాలో పుహాన్ లో మొదలైన్న విషయం తెలిసిందే.  చైనాలో ఇప్పటికే మూడు వేలకు పైగా మరణాలు సంబవిస్తే.. ఇటలీలో వెయ్యి కి పైగా మరణాలు సంబవించాయని అంటున్నారు.  భారత్ లోకరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. సెంట్రల్ హెల్ప్ లైన్ నంబర్ +91-11-23978046కు కూడా ప్రజలు డయల్ చేయవచ్చని తెలిపింది. 5 వేల మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

 

భారత్‌లో తొలి కోవిడ్ మరణం నమోదైంది. మన దేశంలో 75 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 57 మంది భారతీయులు కాగా మిగతా వాళ్లు విదేశీయలు. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం భారత్ వీసాలను రద్దు చేసింది.  తాజాగా, ఏఎఫ్ పీ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య 5,043గా నమోదైంది. చైనా ప్రధాన భూభాగంలో 3,176 మంది మృత్యువాత పడగా, ఇటలీలో 1,016 మంది చనిపోయారు. ఇరాన్ లోనూ 514 మంది ఈ మహమ్మారికి బలైనట్టు గుర్తించారు.

 

  ఇక కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ప్రజలకు సాయంగా ఉండటం కోసం కేంద్ర ఆర్యోగ మరియు కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లను వెబ్‌సైట్లో ఉంచింది. మొత్తం 121 దేశాలు కరోనా బారినపడగా, 1,34,300 మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు తెలిసింది. కరోనా భయాన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది  రూ.20కి, నాలుగు లేయర్ల రూ.80 మాస్కు రూ.300కు, రూ.40 శానిటైజర్ రూ.160కి, రూ.80ది రూ.200కి  అమ్ముతున్నట్లు  తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: